26.2 C
Hyderabad
July 23, 2024 20: 02 PM
Slider ప్రత్యేకం

దిశ తల్లిదండ్రులపై టిఆర్ఎస్ నాయకురాలి దారుణ వ్యాఖ్యలు

sobha

దిశ తల్లిదండ్రుల గురించి అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ డఫేదార్ శోభ. దిశ కేసులో ఆమె మాట్లాడిన మాటలు అత్యంత బాధ్యతా రహితమైనవి గా చెప్పవచ్చు. అంతే కాకుండా ఆడపిల్లలందరికి ప్రభుత్వం ఏ విధంగా రక్షణ కల్పిస్తుంది? అని కూడా డఫేదార్ శోభ ప్రశ్నిస్తున్నారు.

నేడు కామారెడ్డి జిల్లా పరిషత్ మహిళా సంక్షేమం స్థాయి సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శోభ మాట్లాడారు. ఈ సందర్భంగానే దిశ తల్లిదండ్రులను అత్యంత హేయంగా విమర్శించారు. దిశకు ఆమె తల్లిదండ్రులకు అసలు సఖ్యత లేదని వ్యాఖ్యానించారు.

దిశ పట్ల తల్లిదండ్రులు ప్రేమతోనే లేరని, అందుకే ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కాకుండా చెల్లికి ఫోన్ చేసిందని శోభ వ్యాఖ్యానించారు. అసలు ఆమె భయపడటం ఎందుకు గజిటెడ్ ఆఫీస్ అయి ఉండి తల్లికి ఫోన్ చేయాలా చెల్లికి ఫోన్ చేయాలో తెలిదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇలాంటి వాళ్లకు రక్షణ కల్పించాలంటే అయితదా అంటూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Related posts

కువైట్ వలస కార్మికులకు మా యూత్ వెల్ఫేర్ హెల్ప్

Satyam NEWS

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నిరసన

Satyam NEWS

డబ్బు రెట్టింపు చేస్తామని చెప్పి మోసం చేసే గ్యాంగ్ అరెస్టు

Satyam NEWS

Leave a Comment