31.7 C
Hyderabad
May 2, 2024 10: 48 AM
Slider తూర్పుగోదావరి

అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

#GanjiRajManoj

ఏలూరు జిల్లా పెదవేగి మండలం లో ప్రజల ఆరోగ్య పరిస్థితులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి గంజి రాజ్ మనోజ్ మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులను ఆడిగి తెలుసుకున్నారు. శుక్రవారం నాడు ఆయన ఎం డి ఓ పి హెచ్ సి ని సందర్శించారు.గ్రా మాలలో డెంగ్యూ, మలేరియా, టైపాయిడ్ వంటి వైరల్ ఫీవర్స్ ఉన్నాయా అని వైద్యాధికారులు డాక్టర్ పూర్ణిమ, డాక్టర్ మాధవి, డాక్టర్ సి హెచ్ ఓ రోజ్ మెరిలను ఆరా తీశారు.శీ తాకాలం లో వాతావరణ పరిస్థితులు చిన్నపిల్లలకు, వృద్దుల ఆరోగ్యానికి సహరించవని అన్నారు. నవంబర్ డిసెంబర్, జనవరి మాసాలలో చిన్నపిల్లలకు న్యుమోనియా వ్యాధులు సోకే ప్రమాదముందన్నారు.

వృద్దులకు ఊపిరితిత్తులకు సంబంధించిన సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదమునన్నారు. అటువంటి వ్యాధుల పట్ల వైద్యాధికారులు ఎప్పటికప్పుడు అప్రమాతగా ఉండాలని సూచించారు. ఆసుపత్రిలో రోగులకు మరుగుదొడ్డి సౌకర్యం కల్పించాలని చెప్పారు. ఆసుపత్రి ముఖద్వారం వైపు ప్రహరీ గోడ నిర్మించాల్సిన అవసరముందన్నారు.

Related posts

తుని మున్సిపాల్టీలో చరిత్ర పునరావృతం

Satyam NEWS

నాలుగు జిల్లాల కలెక్టర్ లతో మంత్రి పువ్వాడ టెలి కాన్ఫరెన్స్

Satyam NEWS

డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కు అభినందల మాల

Satyam NEWS

Leave a Comment