38.2 C
Hyderabad
May 2, 2024 21: 12 PM
Slider ప్రత్యేకం

నాలుగు జిల్లాల కలెక్టర్ లతో మంత్రి పువ్వాడ టెలి కాన్ఫరెన్స్

#chiefsecretary

గోదావరి వరద ఉదృతి పై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, నాలుగు జిల్లాల కలెక్టర్ లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. గంట గంటకు పెరుగుతున్న గోదావరి వరద ఉదృతిపై ముఖ్యమంత్రి కేసీఅర్ సూచనల మెరకు భద్రాచలంలో ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, గోదావరి పరివాహక జిల్లాల భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ ENC లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

వేగంగా విస్తరిస్తున్న గోదావరి నీటి ప్రవాహ ప్రమాద తీవ్రత వల్ల ఎదురయ్యే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలన్నారు. ప్రస్తుతం నీటి మట్టం 62 అడుగులకు చేరిందని రానున్న 24 గంటల్లో 75 నుండి 80 అడుగులకు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టు భద్రాచలంలో 5వెల ఇసుక బస్తాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఎగువ నుండి 30లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకి వస్తుందని, రాగల 24 గంటల్లో అది మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదని అన్నారు. అన్ని వైపుల, అన్ని రంగాల సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉందని, ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు.

ప్రమాద తీవ్రత ఎర్పడనున్న ఇళ్ల ప్రజలను సైతం పునరావాస కేంద్రాలకు తరలించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, అవసరం అయితే మరిన్ని కేంద్రాలు పెంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపిస్తామని వివరించారు. గోదావరి పరివాహక ప్రాంతం జిల్లాల కలెక్టర్ లు అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుత వరద తీవ్రత వల్ల సద్యమైనంత మేరకు అస్థి నష్టం, ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని సూచించరు.

ముంపు ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకావాలని, భోజనం, వసతి సదుపాయాల కోసం నిధుల కొరత లేదని, పది వేల మందికైనా సరే ప్రభుత్వపరంగా ఆశ్రయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమై ఉందని తెలిపారు. జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మాజి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ, తెల్లం వెంకట్రావు తదితరులు ఉన్నారు.

Related posts

లక్కీ ఫెలోస్: ఏటీఎంలోరూ.100 నోట్లకు బదులు రూ.500 నోట్లు

Satyam NEWS

రామోజీరావు ఏం చేయబోతున్నారో?

Satyam NEWS

ఘనంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క జన్మ దిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment