23.2 C
Hyderabad
May 7, 2024 20: 47 PM
Slider ఖమ్మం

ఎన్నికల సామాగ్రి భద్రత విషయంలో జాగ్రత్త

#collector

ఎన్నికల సామాగ్రి భద్రత విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ వెనుక భాగాన ఏర్పాటుచేసిన ఇవిఎం గోడౌన్ ను వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచారు. ఇసిఐఎల్ నుండి 2,197 వివి ప్యాడ్స్ జిల్లాకు చేరినట్లు, వాటిని భద్రపరచుటకు గోడౌన్ తెరచినట్లు ఆయన అన్నారు. వివి ప్యాడ్ లను స్కాన్ చేసి భద్రపరచాలన్నారు. గోడౌన్ లోపల భద్రతకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. చెదలు పట్టకుండా చర్యలు తీసుకోవాలని, అగ్నిమాపక పరికరాలు పనిచేసే విధంగా ఉండునట్లు చూడాలని ఆయన అన్నారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జెడ్పి సిఇఓ వి.వి. అప్పారావు, పీఆర్ ఇఇ కెవికె. శ్రీనివాస్, కలెక్టరేట్ ఎన్నికల పర్యవేక్షకులు రాంబాబు, బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి కమర్తపు మురళి, బిజెపి పార్టీ ప్రతినిధి జి. విద్యాసాగర్, సీపీఐ పార్టీ ప్రతినిధి జి. లక్ష్మీనారాయణ, సిపిఎం పార్టీ ప్రతినిధి ఆర్. ప్రకాష్, ఐఎన్సిపార్టీ ప్రతినిధి ఎస్కె. తాజోద్దీన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మర్రి శ్రీనివాస్, అధికారులు వున్నారు.

Related posts

గ్రామ పంచాయతీలలో విరివిగా మొక్కలు నాటాలి

Satyam NEWS

విద్యుత్ షాక్ తో జవాన్ మృతి

Satyam NEWS

జ్ఙాన స‌రస్వ‌తి దేవాల‌యంలో ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేష‌న్ 627 వ కార్య‌క్ర‌మం

Satyam NEWS

Leave a Comment