37.2 C
Hyderabad
May 1, 2024 13: 50 PM
Slider ఖమ్మం

స్వామి వారి కళ్యాణం ఏర్పాట్లు

#collector

ఈ నెల 30 వ తేదీన గురువారం శ్రీరామ నవమి సందర్భంగా ఖమ్మం నగరం ఇందిరా నగర్ పర్ణశాల శ్రీతారామచంధ్రస్వామి దేవాలయం వద్ద జరిగే శ్రీసీతారామచంధ్రస్వామి వారి కళ్యాణమహోత్సం, అనంతరం సాయంత్రం లకారం ట్యాంక్‌బండ్‌లో నిర్వహించే శ్రీస్వామివారి తెప్సోత్సం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ పోలీసు కమీషనర్‌ విష్ణు.యస్‌ వారియర్‌, నగర మేయర్‌ పునుకొల్లునీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, నగరపాలక సంస్థ కమీషనర్‌ ఆదర్శ్ సురభితో కలిసి లకారం ట్యాంక్ బండ్ వద్ద పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌  అధికారులకు పలు సూచనలు చేశారు.  నగరపాలక సంస్థ కమీషనర్‌కు తెప్సోత్సం ఏర్పాట్లు, పోలీసు శాఖచే బందోబస్తు, బోటింగ్‌, తెప్సోత్సవం కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత శాఖలు  జిల్లా పర్యాటక శాఖ, మత్సశాఖ, రవాణా, ఇర్రిగేషన్‌, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, అర్భన్‌ తహశీల్దారు తగు ముందస్తు ఏర్పాట్లు చేసి పర్యవేక్షణ చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ ఎన్‌. మధుసూదన్‌, అడిషనల్‌ డి.సి.పి. సుభాష్‌ చంద్రబోస్‌, జిల్లా రెవిన్యూ అధికారి శిరీష, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ మాలతీ, అర్‌. టి.ఓ. కిషన్‌ రావు, ఎ.డి. మత్య శాఖ అధికారి ఆంజనేయస్వామి, ఇరిగేషన్‌ ఇ. ఇ. అనన్య, జిల్లా టూరిజం అధికారి సుమన్‌ చక్రవర్తి, జిల్లా ఫైర్‌ అధికారి, ఖమ్మం అర్బన్‌ తహసీల్దార్‌ శైలజ, అధికారులు స్థానిక కార్పొరేటర్‌ స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

Related posts

తెలంగాణలోని చాలా ప్రాంతాలకు వానగండం

Satyam NEWS

ఆలోచించండి

Satyam NEWS

పత్తికొండలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

Satyam NEWS

Leave a Comment