32.2 C
Hyderabad
May 9, 2024 11: 16 AM
Slider హైదరాబాద్

చక చకా అంబీర్ చెరువు సుందరీకరణ పనులు

Arekapudi Gandhi

హైదరాబాద్ శివారులోని అంబీర్ చెరువు పరిసర ప్రాంత ప్రజలు దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజలు అనారోగ్యం బారిన పడకూడదని చెరువు పూడిక తీత పనులు వేగవంతం చేయాలని శేరిలింగంపల్లి శాసనసభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆదేశించారు.

ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని చెప్పామని, అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. తామర పువ్వులను పెంచి అంబీర్ చెరువును సుందరీకరిస్తామని ఆయన తెలిపారు. నేడు ఆయన ప్రగతి నగర్ అంబిర్ చెరువు సుందరీకరణ పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు.

అదేవిధంగా  చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చెరువులను సంరక్షిస్తామని గాంధీ పేర్కొన్నారు. చెరువులు కలుషితం కాకుండా, కబ్జాలకు గురి కాకుండా చెరువులను పూర్తి స్థాయి లో సంరక్షిస్తామని, చెరువు చుట్టూ ఫెన్సింగ్  ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసి,ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ విశ్వం పాల్గొన్నారు.

ఇంకా  హైదర్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నార్నె శ్రీనివాస రావు, తెరాస నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్,  నెస్ట్ ప్రణీత్ హ్యాపీ హోమ్స్ అసోసియేషన్ ప్రతినిధులు  రమేష్ బాబు, మహేష్  బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొత్త కార్పొరేషన్ చైర్మన్ లకు జగన్ ప్రభుత్వం షాక్

Satyam NEWS

న్యూ డైరెక్షన్: వ్యక్తిగత ఎజెండా వద్దు ప్రజాపాలనే ముద్దు

Satyam NEWS

చినుకు రాక

Satyam NEWS

Leave a Comment