37.2 C
Hyderabad
April 26, 2024 20: 42 PM
Slider తెలంగాణ

ఆర్టీసీ కార్మికులను అవమానించిన ఎమ్మెల్యే అనుచరుడు

అసలే ఆకలి మంటలతో ఉన్న ఆర్టీసీ కార్మికులను పరుష పదజాలంతో తిట్టాడో రాజకీయ నాయకుడు. తమ డిమాండ్ల సాధన కోసం 38 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు నేడు జేఏసీ పిలుపు మేరకు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఈ కార్యక్రమం జరిగే సమయంలో ఎమ్మెల్యే ఇంట్లో లేరు. అయితే కొల్లాపూర్ ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా ఆయన ఇంటి ముందర ధర్నా చేశారు. 38 రోజులుగా సమ్మె జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నినాదాలు చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్, సిపిఎం పార్టీలకు చెందిన వారు కూడా పాల్గొన్నారు. కొల్లాపూర్  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్, మండల అధ్యక్షుడు పరుశరాం, సిపిఎం నాయకులు శివ వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు ధర్నా చేస్తున్న సమయానికి ఎమ్మెల్యే ఇంట్లో లేడు. ఇతర కార్యక్రమాలకు వెళ్లాడు. అయితే కొద్దిసేపు ఆర్టీసీ జేఏసీ నాయకులు నినాదాలు చేసిన తర్వాత తిరుగు ప్రయాణం అయ్యారు. ఆర్టీసీ కార్మికులు ధర్నా విరమించి తిరిగి వస్తున్న సమయంలో ఎప్పుడు చూసినా ఎమ్మెల్యే ఉండడు. ఇతని కన్నా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావే బెటరు. మంత్రిగా ఉన్నప్పుడు కూడా అందుబాటులో ఉండేవాడు… అనుకుంటూ వస్తున్నారు. ఈ మాటలు విన్న కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు మూలె కేశవులు వారిపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ఓట్లు వేసిన వారిని అవమానపరిచే విధంగా (ఇక్కడ రాయలేని విధంగా) బూతులు మాట్లాడటంతో ఆర్టీసీ కార్మికులు ఒక్క సారిగా కోపంతో అతడిని పట్టుకోబోయే ప్రయత్నం చేశారు. అయితే కేశవులు తప్పించుకుని పరారయ్యాడు. దాంతో ఆర్టీసీ కార్మికులు మళ్లీ ధర్నాకు దిగారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి తప్పించుకు పారిపోయిన మూలె కేశవులును తీసుకువచ్చి క్షమాపణ చెప్పించారు. దాంతో ఆర్టీసీ కార్మికులు శాంతించారు.

Related posts

2023 కొల్లాపూర్ బరిలో నిలిచేది వీరే..?

Satyam NEWS

ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 77వ ఆవిర్భావ దినోత్సవం

Satyam NEWS

సర్వే:సౌండ్ పొల్యూషన్ దేశం లో హైదరాబాదే టాప్

Satyam NEWS

Leave a Comment