27.7 C
Hyderabad
April 30, 2024 10: 48 AM
Slider ముఖ్యంశాలు

భగత్ సింగ్ జీవితచరిత్ర తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

#bhagatsingh

కర్ణాటకలోని బిజెపి ప్రభుత్వం పదవ తరగతి పుస్తకం లో భగత్ సింగ్ జీవిత చరిత్ర పాఠ్యాంశాన్ని తొలగించడం సిగ్గుచేటని కర్ణాటక ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని భగత్ సింగ్ జీవిత చరిత్ర పాఠ్యాంశాన్ని కొనసాగించాలని విద్యార్థి సంఘం నాయకుడు డి.శేఖర్ డిమాండ్ చేశారు.

భగత్ సింగ్ లాంటి విప్లవ వీరుడి పాఠ్యాంశాన్ని తొలగించడం కర్ణాటక ప్రభుత్వం అవివేకానికి నిదర్శనమని అన్నారు మహనీయుని చరిత్రను తొలగించడం లో బిజెపి కనీస పరిజ్ఞానం లేదని అన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో వారికి పాత్ర లేదు కనుక చరిత్ర కనుమరుగు చేయాలని కుట్ర చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భగత్ సింగ్ భారత దేశ ప్రజల్లో నిలిచి పోయే మహూన్నత వ్యక్తి లాంటి వ్యక్తి చరిత్ర కనుమరుగు చేయాలనుకోవడం సిగ్గుచేటు అన్నారు.

దేశం కోసం అతి చిన్న వయసులో చిరునవ్వు నవ్వుతూ ఉరికంబం ఎక్కిన మహానీయుడని అలాంటి మహనీయుని పాఠ్యాంశాన్ని తొలగించడం, అదే స్థానంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టే ఆరెస్సెస్ భావజాలం చేర్చడం దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని తెలిపారు.

బిజెపి దేశ స్వతంత్రం కోసం సమగ్రత కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుల పట్టణ బిజెపి ఆర్ఎస్ఎస్ ఏ మాత్రం గౌరవం ఉందో ఘటనతో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మహనీయుల చరిత్ర ను కనుమరుగు చేయాలనుకుంటే ఆర్ఎస్ఎస్ బిజెపి కి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు

కర్ణాటక ప్రభుత్వం వెంటనే భగత్ సింగ్ జీవిత చరిత్ర పాఠ్యాంశాన్ని కొనసాగించాలని మత విద్వేషాలు రెచ్చగొట్టే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పాఠ్యాంశాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.

Related posts

న్యూ కెప్టెన్ :ఏపీ పీసీసీకి కొత్త అధ్యక్షుడిగా సాకే

Satyam NEWS

గిఫ్ట్ టు కేసీఆర్: దాదాపు 500 ల మొక్కలు నాటిన కేబి స్కూల్

Satyam NEWS

సీఎం జగన్ పర్యటన సందర్భంగా సభా స్థలి ఖరారు

Satyam NEWS

Leave a Comment