26.7 C
Hyderabad
May 3, 2024 09: 30 AM
Slider ఖమ్మం

7న ఆదివాసీల భారత్ బంద్

#Bharat Bandh

దేశవ్యాప్తంగా ఆదివాసులపై జరుగుతున్న అన్యాయాలకు , అత్యాచారాలకు దానితోపాటు నూతనంగా ప్రవేశపెట్టనున్న కామన్ సివిల్ కోడ్ కు వ్యతిరేకంగా రాష్ట్రీయ ఆదివాసి ఏకతా పరిషద్ ఆధ్వర్యంలో ఆగస్టు ఏడవ తేదీన తలపెట్టిన భారత్ బంద్ ను పురస్కరించుకొని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో బంద్ కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోతు బద్రు నాయక్ , భామ్ సేఫ్ రాష్ట్ర కార్యాలయ ఇంచార్జ్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ కామన్ సివిల్ కోర్టు పేరుతో దేశంలో సమాన నాగరికత చట్టాన్ని తెచ్చి రాజ్యాంగం కల్పించిన ఎస్టీ గుర్తింపును రద్దు చేసే కుట్రతోపాటు వారిని హిందువులుగా మార్చే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు .

అభివృద్ధి , పర్యావరణ పరిరక్షణ , వన్య ప్రాణుల సంరక్షణ పేరుతో అడవి నుండి ఆదివాసులను తరిమేసే పన్నాగం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం లక్ష్యంగా ఉందన్నారు . జాతీయ కారిడార్ల నిర్మాణం పేరుతో నూతన రహదారులను నిర్మించి , వాటి పక్కన ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేసి , ఆదివాసులను వాటి దరిదాపుల నుండి తరిమి వేసే కుట్రలకు తెర లేపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు .

2020-21-22 వ సంవత్సరాలలో ఆదివాసులకు వ్యతిరేకంగా అనేక చట్టాలు చేశారని . ప్రస్తుతం ఈ సంవత్సరంలో కొత్త అటవీ చట్టం తీసుకొచ్చారని ఈ చట్టాల వల్ల ఆదివాసుల అస్తిత్వమే ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు . మణిపూర్ లో గత రెండు నెలల నుండి ఏమి జరుగుతుందో అందరికీ తెలిసిందేనని , క్రైస్తవులుగా మారిన ఆదివాసులు , ఆదివాసులు కారని వారిని ఆదివాసి జాబితా నుండి తొలగించాలని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోందని , ఆదివాసీ ప్రాంతాలలో హిందూ దేవి దేవతల కథలు చెప్పి , అక్కడ మందిరాలను నిర్మించి , ఆదివాసుల సంస్కృతిని ధ్వంసం చేస్తున్నారని , వారిని హిందువులుగా మార్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు .

ఆదివాసీల ప్రాంతాలలో అనేక అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయని అడవులను ప్రైవేటుపరం చేసి ఆదివాసి ప్రాంతాలలో పెట్టుబడిదారులకు మార్గం సుగమం చేస్తున్నారని ఆర్టికల్ 25 ప్రకారం లభించిన మత స్వచ్చను సైతం నిరాకరించే విధంగా కేంద్రంలోని పాలకులు అడుగులు వేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు . వీటన్నిటికీ వ్యతిరేకంగా ఆగస్టు 7వ తేదీన తలపెట్టనున్న భారత్ బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు .

భామ్ సేఫ్ , రాష్ట్రీయ మూల నివాసి ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమావేశాలు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 27వ తేదీ ఉదయం 10:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయన్నారు . ఈ సమావేశాలకు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా కుల సంఘాల , పార్టీల నాయకులు జంగిపల్లి రవి , అబ్దుల్ రెహమాన్ , ఉపేంద్ర బాయి , జంపా నాయక్ , కొటేషన్ నాయక్ , జి. నరేందర్ , రవీంద్ర నాయక్ , మట్టి ప్రసాద్ , మదన్ నాయక్ , ముని , వీరన్న నాయక్ , రావులపాటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు .

Related posts

కన్నుమూసిన కర్షక్ ఇండస్ట్రీస్ అధినేత

Satyam NEWS

డు నాట్ వర్రీ: పెన్షన్లను పంపిణీ చేసిన సర్పంచ్ అనిత

Satyam NEWS

హుజూర్ నగర్ అదనంగా మరొక ATM ఏర్పాటు చేయాలి

Satyam NEWS

Leave a Comment