37.2 C
Hyderabad
May 2, 2024 13: 29 PM
Slider శ్రీకాకుళం

ఉక్కు చట్టం బాధిత విశ్రాంతి భాషా పండితులకు ఊరట

#vasantarao

యాక్టు 1/2005 కారణంగా రికవరీకి గురైన విశ్రాంతి భాషా పండితులకి ఊరట లభించింది. వారి గ్రాట్యుటీ నుంచి రికవరీ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జీవో.330 అమలులో కోర్టు ధిక్కారం ఎదుర్కొన్న ప్రభుత్వాలు భాషా పండితుల పాలిట ఉక్కు చట్టంగా 2005లో మొదటి చట్టంగా యాక్ట్ 1/2005 తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  ట్రిబ్యునల్ నుంచి హైకోర్టులోనూ, సుప్రీంకోర్టు వరకూ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ(SLTA) SLTA కేవలం SLTA సారధ్యంలో జరిపిన న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది.

2005 తర్వాత రిటైరైన 1/2005 చట్టం బాధితులకు వాళ్ల రిటైర్మెంట్ గ్రాట్యుటీ నుంచి రికవరీ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 365 పైచిలుకు భాషాపండితులకు(జీవో 330 ద్వారా లబ్దిపొంది, రికవరీ చేయబడ్డ వారు) ఇది ఊరట కానుంది. SLTA చరిత్రలో ఇది ఒక మైలురాయి. SLTA విజయాల్లో ఇది మరో కలికితురాయి. హర్షం వ్యక్తం చేసిన వారిలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిసిని వసంతరావు, కూన రంగనాయకులు, రాష్ట్ర కార్యదర్శి వాండ్రంగి గౌరీ కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్నాన వెంకటరమణ,జిల్లా ముఖ్య సలహాదారు రఘు పాత్రుని శ్రీనివాసరావు, జిల్లా సహాధ్యక్షులు కుప్పన్న గారి శ్రీనివాసరావు, టేకి బాబూరావు,జిల్లా సంయుక్త కార్యదర్శులు గొడబ మేరీ ప్రసాద్, చింతపల్లి జనార్ధన రావు,గంటి మీనాకుమారి తదితరులు ఉన్నారు.

Related posts

సింగరాజుపల్లి, గొట్టిముక్కుల రిజర్వాయర్లకు నిధులు కావాలి

Satyam NEWS

పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశ పెట్టి అమలు చేయాలి

Satyam NEWS

పటిష్టమైన విదేశాంగ విధానంతో భారత్ ముందుకు….

Satyam NEWS

Leave a Comment