40.2 C
Hyderabad
May 2, 2024 15: 30 PM
Slider హైదరాబాద్

భాష్యం మోడల్ స్కూల్ వారి “చంద్రయాన్ 3 విజయోత్సవ” ర్యాలీ

#bhashyam

చంద్రయాన్ 3 ను విజయవంతంగా ప్రయోగించి భారతదేశం తన కీర్తి పతాకను చందమామ పైకి చేర్చిన సందర్భంలో అంబర్ పేట భాష్యం మోడల్ స్కూల్ వారు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చంద్రయాన్ 3 భారతదేశ అంతరిక్ష పరిశోధనా శక్తిని ప్రపంచానికి చాటిందని, ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుని దక్షిణ భాగంలో చంద్రయాన్3 ను విజయవంతంగా దింపిన ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. చంద్రయాన్2 అనుకున్న ఫలితం సాధించలేక పోయినా, నిరాశ చెందకుండా మరింత కష్టపడి, విజయం సాధించిన ఈ విషయం విద్యార్థులకే కాక అందరికీ ప్రేరణగా నిలుస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు మరియు కార్యకర్తలు కూడా పాల్గొని జయహో భారత్, జయహో ఇస్రో అంటూ ఉత్సాహంగా నినాదాలిస్తూ హోరెత్తించారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

సీనియర్ జర్నలిస్టు గోపాల స్వామి మృతికి వెంకయ్య సంతాపం

Satyam NEWS

సీఎం జగన్ వెకిలినవ్వు.. నిరుద్యోగుల చెవిలో పువ్వు !

Satyam NEWS

నాటు సారా స్థావరాలపై ఎక్సయిజ్ దాడులు

Satyam NEWS

Leave a Comment