29.7 C
Hyderabad
May 2, 2024 06: 14 AM
Slider కడప

గృహా నిర్మాణ బకాయిలు చెల్లించకుంటే న్యాయ స్థానాలే దిక్కు

#Bhatyala Changalraidu

రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇండ్లు మంజూరు చేస్తూనే, అర్దాంతరంగా బిల్లులు ఆపిన పాత ఇండ్లకు సర్వే చేసి వడ్డీతో సహా చెల్లించాలని కడప జిల్లా రాజంపేట లో టీడీపీ ఇంచార్జీ మాజీ ఎమ్మెల్సీ భత్యాల చెంగల రాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలో ని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కిడ్ కో ద్వారా రూరల్, అర్భన్ లో ఇండ్లు మంజూరు కాగా, నాలుగు లక్షల ఇండ్లు రద్దు చేశారని ఆరోపించారు. మంజూరు అయ్యి బేసి మట్టం వేసిన ఇండ్లు కూడా రద్దు చేశారని 2వేల 400 వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కిడ్ కో కు బాకీ ఉందని,అది చెల్లిస్తే లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని అన్నారు.

నగర పంచాయతీ, మునిసిపాలిటీ లో పూర్తి అయ్యిన ఇండ్లను లబ్ధిదారులకు అలాట్ మెంట్ ఇవ్వలేదని,దీనితో వారు బ్యాంకు లకు వడ్డీలు కడుతున్నారన్నారు. జూలై 8 లోపు సమస్య ను పరిష్కారం చేయ కుంటే టీడీపీ తరపున న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో టీడీపీ నేతలు అద్దెపల్లె ప్రతాప్ రాజు,సంజీవి రాయుడు,మందా శ్రీనివాసులు పాల్గొన్నారు.

Related posts

సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఎమ్మార్పీఎస్

Satyam NEWS

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై ఏసీబీ దాడి

Satyam NEWS

న‌కిలీ ద‌ర్శ‌న టికెట్ల‌తో భ‌క్తుల‌ను మోసం చేసిన వారిపై కేసు

Satyam NEWS

Leave a Comment