30.3 C
Hyderabad
March 15, 2025 10: 32 AM
Slider ఆంధ్రప్రదేశ్

రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

lokesh

మంగళగిరిలో రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నేడు భారీ బైక్ ర్యాలీ జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, సీపీఐ నేతలు నారాయణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మంగళగిరి పరిధిలోని గ్రామాల రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం, నవులూరు, ఎర్రబాలెం, పెనుమాక గ్రామాల్లో పర్యటించిన లోకేష్ రైతులకు  సంఘీభావం తెలిపారు.

సీపీఐ నేత నారాయణను బైక్‍పై వెనుక కూర్చొబెట్టుకుని లోకేష్ బండి నడిపారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అందరి సూచనల మేరకే అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారని అన్నారు. రైతు ప్రభుత్వం అంటూనే రైతులను జగన్ అవమానించారని ఆయన అన్నారు. జగన్ నోటితో మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు అనే వరకూ ఈ ఉద్యమం ఆగదని లోకేష్ తెలిపారు.

30 రోజుల నుంచి జరుగుతున్న ఈ పోరాటంలో రైతులను కించపరుస్తూ వైకాపా ప్రజా ప్రతినిధులు మాట్లాడటం దారుణమని ఆయన అన్నారు. రైతులను పేయిడ్ ఆర్టిస్టులంటు అనటం, రైతులు ఫ్యాంట్ లు వేసుకున్నారని, ఐ ఫోన్ వాడుతున్నారని ఇలా అనేక ఆరోపణలు చేయడం దురదృష్టకరమని లోకేష్ అన్నారు. రైతులు ఫ్యాంట్ లు వేసుకోవటం తప్పా, వారు ఎదగటం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంకు ఇష్టం లేదని స్పష్టం అవుతుందని లోకేష్ అన్నారు.

Related posts

జిల్లా న్యాయ సేవాసదన్ లో బాలల సంరక్షణ పై శిక్షణ…!

Satyam NEWS

రోడ్డు మీదకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

Satyam NEWS

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు అస్వస్థత

Satyam NEWS

Leave a Comment