42.2 C
Hyderabad
May 3, 2024 16: 19 PM
Slider ఆదిలాబాద్

జీవ వ్యర్ధాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

#Nirmal Collector

నిర్మల్ జిల్లాలో జీవ వ్యర్ధాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జీవ వ్యర్ధాల నిర్వహణ పై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో జీవ వ్యర్ధాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైతే జీవ వ్యర్థాలు వస్తాయో వారు కాలుష్య నియంత్రణ మండలిలో జూలై 16 లోపు పేరు నమోదు చేసుకోవాలన్నారు.

నమోదు చేసుకొని వారిపై రోజుకు 12వందల రూపాయలు రుసుము వేస్తామని అన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ భిక్షపతి, జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డా, వసంత్ రావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్ కుమార్, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ దేవేందర్ రెడ్డి, డా.కార్తీక్, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన రద్దు

Satyam NEWS

వనమా అనర్హుడు…కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం

Bhavani

వీరపల్లె లో భత్యాల చీరలు దుప్పట్లు పంపిణీ

Satyam NEWS

Leave a Comment