28.7 C
Hyderabad
April 27, 2024 05: 19 AM
Slider జాతీయం

నన్ పై అత్యాచారం కేసులో బిషప్ నిర్దోషి

#bishop
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్యాథలిక్ సన్యాసినిపై అత్యాచారం కేసులో బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను కొట్టాయంలోని అదనపు సెషన్స్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మే 5, 2014 నుండి రెండేళ్ల వ్యవధిలో కొట్టాయం జిల్లాలోని తన కాంగ్రెగేషన్ మిషన్ హౌస్‌లో ములక్కల్ తనపై 13 సార్లు అత్యాచారం చేశాడని ఒక క్యాథలిక్ సన్యాసిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
దాంతో 2018 సెప్టెంబర్ లో పోలీసులు ములక్కల్‌ను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత 25 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. దేశంలో అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలపై మొదటిసారిగా ఒక క్యాథలిక్ బిషప్‌ను అరెస్టు చేయడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
ఈ కేసు బయటపడిన తర్వాత ములక్కల్ జలంధర్ ను బిషప్‌గా తప్పించారు. 2020లో కేసు విచారణ ప్రారంభమైంది. ములక్కల్ తనపై ఉన్న అభియోగాలను రద్దు చేయాలనే అభ్యర్ధనతో హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, కోర్టులు పిటిషన్‌ను స్వీకరించడానికి నిరాకరించాయి. అధికార దుర్వినియోగం ద్వారా లైంగిక వేధింపులు, అసహజ సెక్స్, అత్యాచారం, ఒక మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగించడం వంటి ఆరోపణలను ఆయన ఎదుర్కొనడంపై సుదీర్ఘ విచారణ జరిగింది. విచారణ అధికారిగా వైక్కం డీఎస్పీ కె.సుభాష్‌ వ్యవహరించారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కొట్టాయం అదనపు సెషన్స్ కోర్టు వెలుపల గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యాచారం కేసులో బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను కొట్టాయంలోని అదనపు సెషన్స్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

Related posts

సింహవాహనంపై అనంత తేజోమూర్తి

Satyam NEWS

మోడీ మాటలే కమలం విజయ రహస్యం

Satyam NEWS

సింగింగ్ లెజెండ్ లతా మంగేష్కర్ ఇక లేరు

Satyam NEWS

Leave a Comment