40.2 C
Hyderabad
May 2, 2024 16: 18 PM
Slider ప్రత్యేకం

15వ రాష్ట్ర పతిగా దళిత మహిళ ప్రమాణస్వీకారం… దేశ వ్యాప్తంగా సంబరాలు

#celebrations

అట్టడుగు వర్గానికి చెందిన వారెవ్వరినైనా..బీజేపీ అత్యున్నత పదవిని కట్టబెడుతుందని బహుశా కాంగీ..ఎర్రజెండా పక్షులెవ్వరైనా ఊహించి ఉండరు.14 వ రాష్ట్ర పతిగా రామ్ నాధ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయడంతో దేశ ప్రజలు యావన్మందికీ ఓ స్పష్ఠత వచ్చింది. తాజాగా 15 వ రాష్ట్ర పతిగా ఓ దళిత వర్గానికి చెందిన మహిళ ను దేశ అత్యున్నత స్థానంలో ప్రప్రథమ పౌరు రాలిగా ప్రమాణస్వీకారం చేయడం తో..కాంగీ దాంతో పాటు ఆ పక్ష పార్టీ లకు మింగుడు పడటం లేదు.

ఆ విషయం పక్కన పెడితే… ద్రౌపది ముర్ము రాష్ట్ర పతిగా ప్రమాణ స్వీకారం చేయడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. పార్టీ పరంగా ఎలాగో అన్ని రాష్ట్రాల కార్యాలయాలలో సంబరాలు జరుపుకుంటున్నారు.కానీ దక్షిణాది రాష్ఠ్రాలలో మరీ ముఖ్యంగా కేసీఆర్ ఇలాఖాగా చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలో ఆ సంబురాలు జరుపుకోవడం విశేషం.

మరీ ముఖ్యంగా పలు ఆలయాలు..ట్రస్టీలు..దేవస్థానాలలో ద్రౌపది ముర్ము ఫోటో కు పాలాభిషేకాలు చేయడం తో పాటు అన్నదానాలు చేయడం విశేషం. అందుకు నిదర్శనమే..హైదరాబాద్ శివారు వనస్థలిపురం లోని శ్రీ భ్రమరాంబిక సమేత మల్లిఖార్జున స్వామి దేవాలయం లో ఆలయ ట్రస్ట్ సభ్యులంతా..రాష్ట్ర పతి ఫోటో పెట్టి మరీ సంబరాలు జరుపుకున్నారు.

అంతటితో ఆగక..పిల్లలకు సాంస్కృతిక పోటీలతో పాటు అన్నదానం కార్యక్రమం చేపట్టడం విశేషం. ఈ కార్యక్రమంలో మఠం కుమార్, వేంకటమణిశేఖర్ ,ఉప్పు వెంకటేష్, పురుషోత్తం, నరేంద్ర, రామిరెడ్డి, ఉదయ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పాతబస్తీ పాఠశాలల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

Bhavani

టెన్నిస్ కోర్ట్ పనులన్నీ పూర్తి చేయాలి

Murali Krishna

మేడ్చల్ -మల్కాజ్ గిరి జిల్లా నూతన ట్రెసా కార్యవర్గం ఎన్నిక

Satyam NEWS

Leave a Comment