42.2 C
Hyderabad
May 3, 2024 16: 35 PM
Slider ముఖ్యంశాలు

యునెస్కో నిబంధనలకు అనుగుణంగా రామప్ప అభివృద్ధి పనులు

#ramappatemple

ములుగు జిల్లా కలెక్టరేట్ పాలంపేట ఏరియా అభివృద్ధి కమిటీ తొలి సమావేశం నేడు నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య పాత్రికేయులతో మాట్లాడుతూ పాలంపేట అథారిటీ స్టేట్ కమిటీ డైరెక్టర్ టూరిజం అండ్ కల్చరల్ డైరెక్టర్ సందీప్ కుమార్ సుల్తానియా ఆహ్వానించామని తెలిపారు.

అభివృద్ధి కమిటీ మెంబర్ పాండురంగారావు,  ప్లానింగ్ అధికారి కన్వీనర్ గా కమిటీని సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని తెలిపారు. ఆగస్టు నెలలో సి ఎస్ ఆర్ అధ్యక్షతన కమిటీ వేసి రామప్పకు వారసత్వ సంపద గుర్తింపు పొందినందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు ప్రతిపాదనలు నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు.

పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో చేపట్టి రోడ్డును బాక్స్ పద్ధతిలో కల్వర్టు నిర్మించి ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ప్రపోజల్ చేసి రామప్ప చుట్టుపక్కల ఉన్న ఏడు దేవాలయాలను సుమారు 11 కోట్ల రూపాయలతో రామప్పలో పనులు చేపట్టి పూర్తి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యురాలు ధనసరి అనసూయ, కాకతీయ హెరిటేజ్ ప్లానింగ్ మెంబర్ పాండురంగారావు, ఐటీడీఏ పీవో అంకిత్, జిల్లా అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు ఇలా త్రిపాటి, అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ వై వి గణేష్,  ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్, సంబంధిత శాఖల అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆత్మహత్యాయత్నానికి గురైన దళిత విలేఖరికి దక్కని న్యాయం

Satyam NEWS

ట్రాజెడీ: కోడి కత్తి గుచ్చుకుని ఒకరి మృతి

Satyam NEWS

అరుణాచలం గిరి ప్రదర్శనకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Bhavani

Leave a Comment