29.7 C
Hyderabad
May 2, 2024 04: 33 AM
Slider హైదరాబాద్

పాతబస్తీ పాఠశాలల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

#Republic Day

హైదరాబాద్ పాతబస్తీలోని పలు పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గౌలిపుర లలితాబాగ్ రోడ్ లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, శాలిబండ, ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల బేరూన్ గౌలిపుర లలో ఈ రోజు గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.

ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మైత్రి టీచర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జె.హరి పతాకావిష్కరణ చేసారు. ఈ వేడుక లో ఉన్నత పాఠశాల టీచర్లు శ్రీనాథ్, రామసుబ్బారావు, సాయిబాబ , రాధిక, మంజుల, శ్రీదేవి, వాణి టీచర్లు, ప్రాథమిక పాఠశాల నుండి శ్రీనివాసరావు, సమీర్ కుమార్, సురేశ్ , సంధ్య సుత్రావె, ఝాన్సీ లక్ష్మీబాయి, రాధాప్యారి టీచర్లు , ప్రథమ్ ఫౌండేషన్ సుజాత, ఎం.వి.ఫౌండేషన్ మమత టీచర్ల సమక్షంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందుచేసాయి. విద్యార్థులు ఫ్యాన్సీడ్రస్ పరేడ్ లో భారత మాత, గాంధీ తాత, ఝాన్సీ లక్ష్మీబాయి,డాక్టర్, టీచర్,

పోలీసు మొదలగు వేషధారణలలో ఆకట్టుకున్నారు. వారి భవిష్యత్ లో తమకున్న ఆకాంక్షల్ని తమ చిన్న సందేశాలలో పంచుకున్నారు. ధి తాత వేషధారణ అందరిని ఆకట్టుకుంది. ప్రధానోపాధ్యాయులు, టీచర్లు విద్యార్థులనుద్దేశించి తమ సందేశాన్నిచ్చారు. బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.ప్రతిభ కనిపించిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేసారు. విద్యార్థులకు స్వీట్లు ,బిస్కెట్లు పంచారు. ఈ వేడుక చాలా ఉత్సాహంగా ఆనందంగా సాగింది.

Related posts

మంత్రి కాన్వాయ్ ని ఢీకొన్న ద్విచక్ర వాహనం

Satyam NEWS

తిరుపతి లో లాక్ డౌన్ విధానంపై వ్యాపారుల నిరసన

Satyam NEWS

ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి ఆడబడ్డకు జన్మనిచ్చిన ఐఏఎస్ అధికారిణి

Satyam NEWS

Leave a Comment