28.7 C
Hyderabad
May 6, 2024 00: 27 AM
Slider నల్గొండ

ఎమ్మెల్సీ ఎన్నికలకు పట్టభద్రులందరూ ఓట్లు నమోదు చేసుకోవాలి

BJPHujurnagar

పట్టభద్రుల ఓటరు నమోదు పై సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది.

శుక్రవారం పట్టణ అధ్యక్షుడు ముసుకుల చంద్రారెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సూర్యాపేట జిల్లా BJP అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి  పాల్గొన్నారు. ముందుగా 151వ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి స్వాతంత్ర్య సమరంలో ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు.

అనంతరం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓట్ల నమోదు కార్యక్రమంపై మార్గదర్శనం చేశారు. 2017వ, సంవత్సరం నాటికి డిగ్రీ పూర్తి చేసిన  ప్రతి ఒక్కరూ డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి జిరాక్సు, పోలింగ్ బూత్ నెంబర్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు వీటన్నింటిని ఫామ్ 18 లో నమోదు చేయవలసిందిగా సూచించారు.

ప్రతి బిజెపి కార్యకర్త కష్టపడి పనిచేసి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి విజయానికి నాయకులు, కార్యకర్తలు అకుంఠిత దీక్షతో కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మండల జిల్లా నాయకులు, నియోజకవర్గ కోకన్వీనర్ బాల వెంకటేశ్వర్లు, కుందూరి కోటిరెడ్డి, అందె కోటయ్య, పోకల వెంకటేశ్వర్లు, పార్థ బోయిన విజయ్, వల్లపు దాసు గోపి, కొత్తూరు వెంకటేశ్వర్లు,

కాటి బోయిన లింగరాజు, సాముల సైదిరెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, నర్సింగ్ అంజయ్య, కుక్క డప్పు వెంకటేశ్వర్లు, కంటు నాగరాజు, గుండెబోయిన వీరబాబు  తదితరులు పాల్గొన్నారు.

Related posts

హిందూపూర్ 1 వ పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ

Bhavani

గుడ్ వర్డ్: విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలి

Satyam NEWS

పాత్రునివలసలో ఘనంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవం

Bhavani

Leave a Comment