38.2 C
Hyderabad
April 29, 2024 22: 26 PM
Slider నిజామాబాద్

వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం

#BichkundaPolice

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దదడిగి గ్రామానికి చెందిన గొళ్ల హనుమాన్లు( 35) గత రెండు రోజుల క్రితం వాగులో గల్లంతైన విషయం విదితమే.

దీంతో పోలీస్ రెవెన్యూ  అధికారులు గత రెండు రోజుల నుండి గజ ఈతగాళ్లతో గాలింపులు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో వారు పెద్ద  దడిగి వాగు వారధి కింద వలలు  వేయడంతో శుక్రవారం సాయంత్రం ఆ వలలకు వచ్చి మృతదేహం  చిక్కుకుంది.

ఇది గమనించిన స్థానికులు పోలీస్ అధికారులకు సమాచారమివ్వడంతో ఎస్సై సాయన్న ఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. పోస్టుమార్టం అయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పజెప్పినట్లు ఆయన వివరించారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. దీంతో గొళ్ల హనుమాన్లు కుటుంబంలో పెద్ద దడిగి  గ్రామంలో  విషాదఛాయలు అలుముకున్నాయి.

Related posts

ప్ర‌పంచ హృద‌య దినోత్స‌వం: ఎస్పీ దీపికా జెండా ఊప‌డంతో ప్రారంభ‌మైన ర్యాలీ

Satyam NEWS

టెలిఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర సంస్థలతో ఆడిట్ కి సిద్ధమా?

Satyam NEWS

చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి

Satyam NEWS

Leave a Comment