33.7 C
Hyderabad
April 30, 2024 02: 11 AM
Slider అనంతపురం

హిందూపూర్ 1 వ పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ

శ్రీ సత్య సాయి జిల్లా అదనపు ఎస్పీ కె.వి రామకృష్ణ ప్రసాద్ హిందూపూర్ సబ్ డివిజన్ పరిధిలోని హిందూపూర్ 1 వ పట్టణ పోలీస్ స్టేషన్ ని ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్, పోలీస్ స్టేషన్ పరిసరాలను, స్టేషన్ లో సీజ్ చేయబడిన వాహనాలను, లాకప్ గదులను మరియు కంప్యూటర్ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. సబ్ డివిజన్ పరిధిలో ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకొని సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. బీట్స్ బాగా పెంచి స్టేషన్ పరిధిలో జరిగే రెగ్యులర్ క్రైమ్ పై ప్రత్యేక దృష్టి సారించి వాటి పూర్తిస్థాయి నియంత్రణ చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా స్థానిక ప్రజలతో సమన్వయం చేసుకుంటూ వారి ద్వారా సమాచారం సేకరిస్తూ తద్వారా నేరాలకు అడ్డుకట్టు వేయాలని తెలియజేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి చట్టపరమైన సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని తెలియజేశారు. సిబ్బంది ఎవరైనా బాధ్యత రాహితంగా వ్యవహరిస్తున్నట్లయితే, వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడ బోమని తెలియజేశారు.

Related posts

తెరిపిన పడుతున్న తెలంగాణ రైతుల్ని చూసి ఈర్ష్యపడుతున్న బీజేపీ

Satyam NEWS

గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేటర్స్ స్పోర్ట్స్ మీట్

Satyam NEWS

క్వారంటైన్ నిబంధనలకు విరుద్ధంగా గొడవ చేసిన ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment