26.7 C
Hyderabad
May 3, 2024 07: 43 AM
Slider నల్గొండ

కాసుల ఆంజనేయులుకు పుడమి జాతీయ పురస్కారం

#Sahiti Award

పుడమి సాహితీ వేదిక నల్లగొండ వారు ప్రతి సంవత్సరం వివిధ రంగాలలో విశిష్ట కృషి చేసిన వ్యక్తులకు అందించే జాతీయ పురస్కారం ఈ సంవత్సరము 2020 గాను సాహితీరంగంలో నల్లగొండ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన కాసుల ఆంజనేయులు కు దక్కింది.

ఆయన ప్రస్తుతం తెలుగు పండితులుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంకిరెడ్డి గూడెం మండలం చౌటుప్పల్ జిల్లా యాదాద్రి భువనగిరి లో పని చేస్తున్నారు. కాసుల ఆంజనేయులు కొన్ని సంవత్సరాలుగా తనదైన శైలిలో సాహిత్యం అనేక కవితలకు సమీక్షలు పుస్తకాల పరిశీలన తో ముందుకు సాగుతున్నారు.

ఆయన అనేక రచనలు చేశారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ సేవలను పరిగణలోనికి తీసుకుని పుడమి సాహితీ వేదిక జాతీయ పురస్కారానికి  వీరిని ఎంపిక చేసింది.

ఈరోజు సూర్యాపేట జిల్లా నడిగూడెం రాజా వారి కోటలో జరిగిన కార్యక్రమాల్లో ప్రముఖ చరిత్రకారుడు ఆర్కియాలజీ అండ్ కల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ కుర్రా జితేంద్ర బాబు, ప్రముఖ కవులు విమర్శకులు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఎన్నో సంవత్సరాలుగా సుపరిచితులు

మంచి సాహిత్యంతో  పాటు విద్యార్థులకు పాఠాలు చెప్పడం లో నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. ఆయన వద్ద చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు లాయరుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, టీచర్లుగా, పోలీసులుగా అనేక ఉద్యోగాలు చేస్తున్నారు.

కాసుల ఆంజనేయులు గత 28 సంవత్సరాల నుండి విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నారనీ నిర్వాహకులు తెలిపారు.

Related posts

మరపురాని మనిషి వైయస్ఆర్

Bhavani

భారత్ తో లోపాయకారి ఒప్పందాలపై ఇమ్రాన్ ఖాన్ విమర్శలు

Satyam NEWS

గాంధీజీ చూపిన అహింసా మార్గాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment