38.2 C
Hyderabad
May 3, 2024 20: 14 PM
Slider జాతీయం

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని దూషించిన బీజేపీ ఎంపి

#maheshsharma

నోయిడా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మహేశ్ శర్మకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారితో ఆయన కోపంగా మాట్లాడుతున్నాడు. ‘‘మాకు ప్రభుత్వం ఉందని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం’’ అని మహేష్ శర్మ ఫోన్‌లో కూడా అన్నారు.

అధికార బీజేపీ ఎంపీ అయి ఉండి మహేశ్ శర్మ ఈ విధంగా మాట్లాడటం అందరిని షాక్ కు గురి చేసింది. ఈ వీడియోను సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ట్వీట్ చేశారు. దీంతో పాటు బీజేపీని కూడా టార్గెట్ చేశాడు. ఇంతకీ మహేష్ శర్మ ఆవేశంగా మాట్లాడిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎవరు?

ఈ ప్రశ్న కొద్ది సేపు సస్పెన్స్ గా ఉన్నా ఆ తర్వాత వెల్లడయింది. నోయిడాలోని ఒమాక్స్ సిటీ సొసైటీ లో శ్రీకాంత్ త్యాగి అనే ఒక వ్యక్తి మహిళలను దుర్భాషలాడిన వీడియో నిన్న వైరల్ అయింది. తాను మొక్కలు నాటేందుకు వచ్చానని శ్రీకాంత్ త్యాగి చెప్పగా, స్థలం కబ్జా చేసేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడని అక్కడి మహిళలు ప్రతిఘటించారు.

ఈ వీడియో వైరల్ కాగానే శ్రీకాంత్ త్యాగి అనే వ్యక్తి బిజెపి నేత అని కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ విషయాన్ని బీజేపీ నాయకులు ఖండించారు. అతనికి బిజెపికి సంబంధం లేదని ప్రకటించారు. ఆదివారం నుంచి పరారీలో ఉన్న శ్రీకాంత్ నేడు 10 నుంచి 15 మంది అగంతకులను సొసైటీకి పంపించాడు.

మళ్లీ మహిళలను బెదిరించిన దుండగులు

ఈ దుర్మార్గులు సొసైటీ నివాసులను బెదిరించడం ప్రారంభించారు. దీంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్త స్ప్రెడ్ అయిన వెంటనే నోయిడా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మహేశ్ శర్మ సొసైటీకి చేరుకున్నారు. ప్రజలు ఆయనకు మొరపెట్టుకోవడంతో ఎంపీకి బీపీ ఎక్కువైంది. వెంటనే ఓ అధికారికి ఫోన్ చేసి మీడియా ముందు గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టాడు.

ఎంపీ ఫోన్‌లో ‘మీరు కమిషనర్‌ని అడగండి. నేనూ, మా జిల్లా అధ్యక్షుడూ ఇక్కడ ఉన్నాము. మాకు ప్రభుత్వం ఉందని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. 15 మంది అబ్బాయిలు ఈ సొసైటీకి ఎలా వచ్చారో వారి నుండి తెలుసుకోండి అవనీష్ అవస్తీ జీ,  మీరూ చూడండి. ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు అని మహేష్ శర్మ అన్నారు.

నేడు యోగి ప్రభుత్వంలో అత్యంత బలమైన అధికారులలో అవస్థీ ఒకరు. ఆయన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అత్యంత సన్నిహితుడు. అవస్తీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అదనపు ప్రధాన కార్యదర్శి (హోం శాఖ)గా ఉన్నారు. అతను 1987 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి.

అవ్నీష్ కుమార్ అవస్థికి ఉత్తరప్రదేశ్ పోలీసు మరియు జైలు బాధ్యతలు కూడా ఉన్నాయి. అవస్థికి సమాచార శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. నెల రోజుల క్రితమే ఇంధన శాఖ బాధ్యతలు కూడా స్వీకరించారు. అవ్నీష్ అవస్థి 1962 ఆగస్టు 19న కాన్పూర్‌లో జన్మించారు.

ఇక్కడ నుండి అతను తన ప్రారంభ విద్యను అభ్యసించాడు మరియు తరువాత IIT కాన్పూర్ నుండి BTech ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాడు. 1987లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అవస్థికి UP క్యాడర్ వచ్చింది. అవస్తి భార్య కూడా బాగా పాపులర్.

ఆమె పేరు మాలిని అవస్థి. మాలిని జానపద గాయని. పద్మశ్రీతో సత్కరించారు. జానపద గానంలో మాలిని ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అవనీష్ అవస్తీ, మాలినీ అవస్తీ ఇద్దరూ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు. సీఎం యోగి తీసుకునే ప్రతి ప్రధాన నిర్ణయం వెనుక కూడా అవనీష్ అవస్తీ హస్తం ఉందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి అవనీష్‌పై చాలా నమ్మకం ఉంది. అలాంటి అధికారితో బీజేపీ ఎంపి ఈ విధంగా మాట్లాడటంతో ఇది హాట్ టాపిక్ గా మారింది.

Related posts

సూర్యలంక తీరాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

Satyam NEWS

ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు

Satyam NEWS

బిసిలను ముట్టుకుంటే మసి అయిపోతావు జగన్ రెడ్డీ

Satyam NEWS

Leave a Comment