సిబ్బందికి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ బకాయిలు చెల్లించకుండా తాత్సారం చేస్తున్నందున తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ కు బీజేపీ ఎంపీలు అర్వింద్ ధర్మపురి, బండి సంజయ్, సోయం బాపురావు లేఖ రాశారు. ఆగస్ట్ 2019 గానూ 80 కోట్ల బకాయిలు చెల్లించమని EPO నుంచి డిమాండ్ నోటీస్ కూడా వచ్చిందని అయినా ఆర్టీసీ యాజమాన్యం చెల్లించలేదని వారు లేఖలో పేర్కొన్నారు. మొత్తం పీఎఫ్ కు సంబంధించిన 760 కోట్ల బకాయిలు ఉన్నట్టు ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయని అందువల్ల తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని వారు కోరారు. ఇప్పటికే 49000 మంది ఉద్యోగులు సమ్మె చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి స్పందించలేదని, పీఎఫ్ బకాయిలు చెల్లించంచక పోవడం EPF యాక్ట్ ప్రకారం క్రిమినల్ చర్యలేనని వెంటనే కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా మీరు జోక్యం చేసుకోవాలని వారు లేఖలో పేర్కొన్నారు.