38.2 C
Hyderabad
May 2, 2024 19: 14 PM
Slider కవి ప్రపంచం

పాడవే…!

#Dr Bheempally Srikanth

పాడవే కోయిలా పాడు

పాడవే తియ్యగా పాడు

వసంతం నీ ఊపిరి కదా

నిజాన్ని నిర్భయంగా గొంతెత్తి పాడు

న్యాయాన్ని జండాపై కెత్తి 

అన్యాయాన్ని దునుమాడు

పాడవే కోయిలా పాడు

గ్రీష్మం వేసవితో తరుముకొచ్చినా 

శిశిరం ఆకులను రాల్చివేసినా

హేమంతం చలితో స్మర్శించినా

శరత్తు చల్లని వెన్నెలను వెదజల్లినా

వర్షఋతువు చినుకులతో నాట్యమాడినా

నీ కాలం నీదే కోయిలా 

పాడవే కోయిలా పాడు

కాలమెప్పుడూ ఒకటి కాదు

దానికి వేల కళ్ళు

నిరంతరం పహరా కాస్తూనే ఉంటది

కాగడై కాలాన్ని పట్టి చూపుతది

పాడవే కోయిలా పాడు

నువ్వు ఏ రాగాన్నెత్తుకున్నా

వసంతంలా ఎదలోతుల్లో 

సప్తస్వరాలను పలికిస్తది

కొత్తకొత్త రాగాలను

మనసులను రంజింపజేస్తది

పాడవే కోయిలా పాడు

వసంతం నీ శ్వాస కదా

ఆకులు రాలినప్పుడే కదా

చిగురులను తొడుగుతూ వస్తావు

శిశిరాన్ని వెంటాడుతూనే

హేమంతాన్ని మోసుకువస్తావు

ఆగామి జీవితానికి ఆశలు కల్పిస్తూ

మాలో కొత్త ఆశలను చిగురింపజేస్తావు

 – డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 9032844017

Related posts

మెరుగైన సేవలు

Murali Krishna

గవర్నర్ వ్యవస్థ పరువు తీస్తున్న తమిళసై

Satyam NEWS

మొబైల్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రానికి విశేష స్పందన

Satyam NEWS

Leave a Comment