29.7 C
Hyderabad
May 6, 2024 04: 31 AM
Slider ప్రకాశం

సర్పంచ్‌ వ్యవస్థ నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం

#purandareswari

రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం పంచాయితీలకు ఇవ్వాల్సిన ఆర్థిక సంఘం నిధులను మళ్లించి పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. దీంతో 26 జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుజనాచౌదరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజులతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్‌, బీజేపీ నేతలు, జనసేన నేతలు, సర్పంచులు పాల్గొని..వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

ఒంగోలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నేడు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో సర్పంచులు అప్పులు తెచ్చి గ్రామాల్లో పనులు చేశారని.. ఇప్పుడు ఆ అప్పులు తీర్చలేక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వం సరైన సమయంలో బిల్లులు చెల్లించకపోవడంతో గ్రామాల్లో పనులు చేసిన కాంట్రాక్టర్లు కూడా ప్రాణాలు తీసుకుంటున్నారని ఆగ్రహించారు.

”సర్పంచులకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను ఈ వైఎస్సార్సీపీ ప్రభుత్వం దారి మళ్లిస్తోంది. సర్పంచుల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చాం. గ్రామ పంచాయతీలకు కేంద్రం కేటాయించిన నిధుల దారి మళ్లింపులపై నిరసనలు చేపట్టాం. నిధుల లేమి వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగట్లేదు. సొంత డబ్బులు పెట్టి సర్పంచులు పనులు చేశారు. ఆ పనుల బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది.

చిన్న గుత్తేదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. బిల్లులు రాక చిన్న గుత్తేదారులు కూడా రోడ్డునపడ్డారు. సర్పంచుల ఆత్మహత్యల పాపం..ఈ జగన్‌ది కాదా..?. ఏనాడైనా సర్పంచులపై జగన్‌ మాట్లాడారా..?. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలపైనే జగన్‌ మాట్లాడుతారు తప్ప సర్పంచుల గురించి మాట్లాడరు. సర్పంచుల వ్యవస్థను అవమానపరుస్తున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు.

Related posts

ప్రకాశ్ రాజ్ ఓటమికి రాజకీయ పార్టీల భారీ స్కెచ్

Satyam NEWS

మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా నార్వేకర్ ఎన్నిక

Satyam NEWS

సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించిన వైద్య బృందం

Satyam NEWS

Leave a Comment