23.2 C
Hyderabad
May 7, 2024 20: 51 PM
Slider జాతీయం

మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా నార్వేకర్ ఎన్నిక

#narvekar

బిజెపి అభ్యర్థి రాహుల్ నార్వేకర్ మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆయను అనుకూలంగా మొత్తం 164 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 107 మంది ఓటేశారు. దీంతో స్పీకర్ గా రాహుల్ నార్వేకర్ ఎన్నికయ్యారు. ఎంఐఎం పార్టీ ఓటింగ్ కు దూరంగా ఉంది.

ఎన్నిక పూర్తయిన అనంతరం నర్వేకర్ స్వీకర్ గా బాధ్యతలు స్వీకరించారు. ముంబైలోని కొలాబా అసెంబ్లీ నియోజకవర్గం నుండి బిజెపి ఎమ్మెల్యే అయిన నర్వేకర్, ఎన్‌సిపి నాయకుడు రాంరాజే నింబాల్కర్ అల్లుడు. 2021 ఫిబ్రవరిలో కాంగ్రెస్‌కు చెందిన నానా పటోలే తన పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రాజీనామా చేసినప్పటి నుంచి అసెంబ్లీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది.

అంతకుముందు శివసేనకు సీఎం ఏక్ నాథ్ షిండే ఝలక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి షిండే నేతృత్వంలోని శివసేన నేతలు మహారాష్ట్ర అసెంబ్లీలోని శివసేన శాసనసభాపక్ష కార్యాలయానికి సీల్ వేశారు.  ఈ మేరకు ఆఫీసు తలుపు మీద నోటీసు అంటించారు.

శివసేన శాసనసభాపక్షం సూచనల మేరకు కార్యాలయాన్ని మూసివేస్తున్నామని నోటీసు రాసి పెట్టారు.  మరోవైపు స్పీకర్ ఎన్నిక కోసం  ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ తొలిరోజు సమావేశమైంది. స్పీకర్ పదవి కోసం బీజేపీ తరపున రాహుల్‌ నర్వేకర్‌.., శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ తరపున రాజన్‌ సాల్వీ బరిలో నిలిచారు. 

ఈ నేపథ్యంలో   అన్ని పార్టీల నేతలు అసెంబ్లీకి హాజరయ్యారు. శివసేన తిరుగుబాటు నేత, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, బీజేపీతో కలవడంతో..రాహుల్ సర్వేకర్  గెలుపు  లాంఛనమైంది.

Related posts

కుషాయిగూడ డీమార్ట్ తూనికల్లో అవకతవకలు

Satyam NEWS

లాక్ డౌన్ బాధితులకు ఆహారం అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే

Satyam NEWS

టీబి ముక్తభారత్ లో పాల్గొన్న నెల్లూరు ఎంపీ ఆదాల

Satyam NEWS

Leave a Comment