23.2 C
Hyderabad
May 7, 2024 21: 32 PM
Slider నిజామాబాద్

కమిషన్లకు కక్కుర్తితో ఆసుపత్రి విస్తరణలోఅలక్ష్యం

#BJP Armoor

ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో  పాల్గొన్న ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ నూతుల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇప్పటికీ 30 మాత్రమే ఏర్పాటు చేశారని అన్నారు.

అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 23 కోట్ల రూపాయలను ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ఇస్తే ఇప్పటివరకూ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు చేపట్టలేదని ఆయన విమర్శించారు. గర్భవతులైన మహిళలకు  ఎటువంటి సౌకర్యాలు కూడా లేవని కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని ఇటువంటి ఆస్పత్రి పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు.

కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్లకు ఎగబడి ఆస్పత్రి అభివృద్ధిని విస్మరించడం సరైంది కాదని వెంటనే ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని కోరారు. ఆర్మూరు పట్టణ బిజెపి అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి  మాటలు కోటలు దాటుతున్నాయి గాని చేతలు గడప దాటడం లేదని అన్నారు.

ఆర్మూర్ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారని, కరోనా సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి లో పాటించవలసిన పద్దతులను ఎవరూ పాటించడంలేదని అన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు గాని లేక రోగులతో వచ్చే సహాయకులకు గానీ జాగ్రత్తలు చెప్పే సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.

మాస్కులు కూడా లేకుండా, సానిటైజర్ తో చేతులు శుభ్రపరచకుండానే  ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజలు వస్తున్నారని దీని వలన  ప్రభుత్వ ఆస్పత్రికి రావాలంటేనే రోగం తగ్గించుకోవడానికా? రోగం పెంచుకోవడానికా? అన్న  అనుమానం కలుగుతుందని అన్నారు.

ఆసుపత్రికి వచ్చే వారికి త్రాగటానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కౌన్సిలర్ నరసింహ రెడ్డి మాట్లాడుతూ 6 నెలల క్రితం వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వచ్చినప్పుడు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల గదులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారని అయినా పని కాలేదని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి  ఆకుల రాజు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పోల్కం వేణు, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్, బీజేవైఎం మండల అధ్యక్షులు నరేష్ చారి, కౌన్సిలర్ సాయి కుమార్, ప్రతాప్, దుగ్గి విజయ్, వాసు, ప్రణయ్, లక్కీ, శేఖర్, బబ్లు మరియు బీ.జే.పీ.,బీ.జే.వై.యం. కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

వరద బాధితులకు ములుగు లయన్స్ క్లబ్ చేయూత

Satyam NEWS

రంజాన్ ప్రార్ధనలకు ముస్లింలు బయటకు రావద్దు

Satyam NEWS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల స్వాధీనం

Satyam NEWS

Leave a Comment