37.7 C
Hyderabad
May 4, 2024 14: 11 PM
Slider జాతీయం

Himachal Pradesh: 62 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ

#jpnadda

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 62 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ విడుదల చేసింది. ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ సిరాజ్ నుంచి, అనిల్ శర్మ మండి నుంచి పోటీ చేయనున్నారు. సత్పాల్ సింగ్ సత్తి ఉనా నుంచి పోటీ చేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం ఢిల్లీలో మంగళవారం అర్థరాత్రి వరకు జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ బోర్డు మారథాన్ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు. ఒక్కో సీటుపై మోదీ-షా సంప్రదింపులు జరిపారు. అధికార వ్యతిరేకత కారణంగా ముగ్గురు మంత్రులు, డజను మంది ఎమ్మెల్యేల టిక్కెట్లపై కత్తి వేలాడుతుండగా, ఇద్దరు మంత్రుల అసెంబ్లీ సీట్ల మార్పుపైనా చర్చ జరిగింది. అర్థరాత్రి వరకు అన్ని టిక్కెట్లపై కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంది.

బీజేపీ 62 స్థానాలకు అభ్యర్థుల జాబితాను బుధవారం ఉదయం విడుదల చేసింది. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌, సర్బానంద సోనోవాల్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేశ్‌ కశ్యప్‌, ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు సౌదాన్‌ సింగ్‌, బీజేపీ ఇన్‌ఛార్జ్‌ అవినాష్‌ రాయ్‌ ఖన్నా, కో-ఇన్‌చార్జి సంజయ్‌ టాండన్‌ , కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పలువురు ప్రాంతీయ నాయకులు పాల్గొన్నారు.

Related posts

బ్రహ్మాండమైన కథ-కథనాలతో ఓ రేంజ్ ప్రొడక్షన్స్ “బ్రహ్మ రాసిన కథ”

Satyam NEWS

పెన్షన్ డబ్బులు ఎవరో దోపిడి చేశారట

Satyam NEWS

ఉప్పల్ లో ఘనంగా సదర్ మహోత్సవాలు

Satyam NEWS

Leave a Comment