February 28, 2024 08: 30 AM
Slider ప్రత్యేకం

బీజేపీ ఇంతేనా… ఇక చాలునా?

#Modi

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇది వారికి ఎక్కువే కావచ్చు కానీ .. ఇంతకన్నా ఎక్కువే స్థానాల్లో గెలిచే సత్తా ఉండి ఒక దశలో బీఆర్ఎస్ కు తామే పోటీ అని చెప్పిన బీజేపీ, కాంగ్రెస్ బదులు తానే మూడో స్థానంలో చేరింది. గెలిచిన వారు ఆదిలాబాద్ పాయల్ శంకర్, గోషామహల్ రాజా సింగ్ , ఆర్మురు పైడి రాకేష్ రెడ్డి , కామారెడ్డి వెంకట రమణారెడ్డి , సిర్పూర్ పాల్వాయి హరీష్ బాబు, ముధోల్ రామారావు పటేల్,నిర్మల్ మహేశ్వర్ రెడ్డి ,నిజామాబాద్ అర్బన్ ధనపాల్ సూర్యనారాయణ లు అంటే మొత్తం 8 మంది గెలిచారు.

కానీ కిషన్ రెడ్డి సొంత నియోకజకవర్గం అంబర్ పెట్ లో బీఆర్ఎస్ గెలిచింది. కృష్ణ యాదవ్ ఓడిపోయారు.. రెండు చోట్ల పోటీ చేసిన ఈటెల, కరీంనగర్ నుండి బండి సంజయ్, కోరుట్ల నుండి ధర్మపురి అరవింద్ , లక్ష్మణ్ సొంత నియోజవర్గంలో బీజేపీ అభ్యర్థి పూస రాజు లతో పాటు యెండల లక్ష్మి నారాయణ, చింతల రామచంద్ర రెడ్డి, nvvs ప్రభాకర్, ఎన్ .రామచంద్ర రావు, తల్లోజ్ ఆచారి, కూన శ్రీశైలం గౌడ్, ఏనుగు సుదర్శన్ , ఎర్రబెల్లి ప్రదీప్ రావు లు సైతం ఓటమి చవి చేశారు.

ఈ ఓటముల పై బీజేపీ సమీక్ష కూడా చేయకుండా.. మాజీ తాజా సీఎం లను ఓడించిన కామారెడ్డి బీజేపీ విజేత వెంకటరమణ రెడ్డి విజయమే పెద్దే అసెట్ అనుకుంటూ కిషన్ రెడ్డి చెబుతున్నారు. మంచి స్థితి లో ఉన్న బీజేపీ .. ఈ స్థాయి కి ఎందుకు వచ్చిందో నాయకులు మననం చేసుకోవాలి .. బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నాడు బీజేపీ ఓ స్థాయి లో ఉండేది.. చివరకు విజయశాంతి బయటకు వచ్చినప్పుడు కూడా పార్టీ వైఫల్యాలు చెప్పే బయటకు వచ్చారు.. గోషామహల్ లో పార్టీ నుండి సస్పెండ్ చేసిన రాజా సింగ్ కె పిలిచి టికెట్ ఇచ్చింది. ఓటముల నుండి పాఠాలు నేర్వాలి.. కానీ బీజేపీ పెద్దల వద్ద రాష్ట్ర బలాబలాలు, బలహీనతలపై చర్చా ఏది అని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇదే స్ఫూర్తి తో పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో సాధించిన ఎంపీ సీట్లు బీజేపీ మళ్ళీ సాధించగలదా .. ఇప్పుడు గెలిచిన 8 మంది ఎం.ఎల్.ఏ లతో ఎన్ని నియోజకవర్గాల్లో బీజేపీ జెండా ఎగురుతుంది అనేవి ప్రశ్నలు. బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో గెలిచింది కాబట్టి.. తెలంగాణ ని లైట్ తీసుకున్నారా.. కర్ణాటకలో బీజేపీ దెబ్బ తగిలింది.. ఇప్పుడు తెలంగాణ లో కూడా తగిలినట్టే.. ఏపీ లో బీజేపీ అంతా సిన్ లేదు.. తమిళనాడు లో కూడా సేమ్ సిట్యువేషన్ .. కేరళలో కూడా బీజేపీ అంతంత మాత్రమే. అంటే బీజేపీ కి దక్షిణ భారతదేశంలో బలపడాల్సిన అవసరం లేదో ఏమో..

సీనియర్ జర్నలిస్ట్ పూడి రామకృష్ణ

Related posts

రాఖీ ఎలా కడతావు సోదరి?

Satyam NEWS

భాజపా సోషల్‌ మీడియా రాష్ట్ర బాధ్యుల నియామకం

Bhavani

బీసీలపై జగన్ సర్కార్ దాడి

Bhavani

Leave a Comment

error: Content is protected !!