33.7 C
Hyderabad
April 30, 2024 01: 23 AM
Slider నల్గొండ

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్ట్

#dkaruna

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని చెప్పిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాటలతో భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ పూర్తిగా సమర్థించారు. గత కొద్ది కాలంగా తాము ఇదే విషయం చెబుతున్నామని ఆమె అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలతో మా వాదన నిజమని ఇవాళ మరోసారి తేలిపోయింది అని అరుణ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో రోజురోజుకు బలోపేతమవుతున్న బిజెపిని దెబ్బతీయాలన్న ఎజెండాతో ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ కలిసే పని చేస్తున్నాయని ఆమె అన్నారు. నువ్వు కొట్టినట్టు చెయ్… నేను తిట్టినట్టు చేస్తా… అన్న చందాన ఈ రెండు పార్టీలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. పైకి విమర్శించుకుంటున్నట్టు కనిపిస్తున్నా లోన మాత్రం చేతులు కలిపాయి. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లోనూ కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. పార్లమెంటులోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీలు కలిసే ఉన్నారు. ప్రజలు ఆలోచించుకోవాలి అని ఆమె అన్నారు.

రాష్ట్రంలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై మొదటి నుంచీ గట్టిగా పోరాడేది బిజెపి మాత్రమే. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను సమర్థంగా నిర్వహిచలేక కేసీఆర్ తో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుంది. ఎంతో మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు మళ్లీ బీఆర్ఎస్ పంచన చేరడం ఖాయం. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూదొందే. కాంగ్రెస్ కు ఓటేసినా… బీఆర్ఎస్ కు ఓటేసినా ఆ ఓటు కేసీఆర్ కే వెళ్లడం ఖాయం అని అరుణ అన్నారు. కేసీఆర్, కాంగ్రెస్ నాటకాలు ఇంకా ఎక్కువ కాలం కొనసాగలేవు. ప్రజలు అన్నీ గ్రహిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నీచ రాజకీయాలను అసహ్యించుకుంటున్నారు. తగిన సమయంలో ఈ రెండు పార్టీలకు తప్పక గుణపాఠం చెప్తారు అని అరుణ వ్యాఖ్యానించారు.

Related posts

కేంద్ర మాజీ మంత్రి ని తూర్పారబెట్టిన మంత్రి బొత్స

Satyam NEWS

సీఎం చెప్పిందొకటి.. విద్యాశాఖ చేస్తోందొకటి

Sub Editor 2

డా౹౹చదలవాడను కలిసిన కోడెల శివరామ్

Satyam NEWS

Leave a Comment