37.2 C
Hyderabad
April 26, 2024 19: 47 PM
Slider గుంటూరు

డా౹౹చదలవాడను కలిసిన కోడెల శివరామ్

#chadalawada

గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబును సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కోడెల శివరామ్ నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఇరువురు పార్టీ విషయాలు చర్చించుకొని, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డా౹౹చదలవాడ అరవింద బాబు మాతృమూర్తి చదలవాడ ధనమ్మ మృతిపట్ల కోడెల శివరామ్ ప్రగాడ సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం నాదెండ్ల మండలం సాతులూరు గ్రామం లోని చదలవాడ కుటుంబ సభ్యులను పరామర్శించారు. చదలవాడ ధనమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇరువురు నేతలు నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో ఎస్సీ నాయకులు శ్యాం కుమారుడు వివాహానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలోని స్థానిక ఐల బజార్ లో టీడీపీ మాజీ కౌన్సెలర్ తెల్ల శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు, నరసరావుపేట నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

Related posts

కరోనా ఎఫెక్ట్: రాజ్యసభ ఎన్నికలు వాయిదా యోచన?

Satyam NEWS

త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ దొరల గడీలో బందీ

Satyam NEWS

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం లేదు

Satyam NEWS

Leave a Comment