26.7 C
Hyderabad
May 15, 2024 09: 14 AM
Slider తెలంగాణ

సీఎం చెప్పిందొకటి.. విద్యాశాఖ చేస్తోందొకటి

what the cm said .. what the education department is doing

*కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ ఉండబోదని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ రెండురోజుల క్రితం ప్రకటించారు. అయితే విద్యాశాఖ దీనికి విరుద్ధంగా కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగుల నియామకానికి ఆదేశాలు జారీచేసింది. సమగ్ర శిక్ష విద్యా పథకం కింద వివిధ పోస్టులకు 704 మంది ఉద్యోగులను కాంట్రాక్టు పద్ధతిన నియమించాలని పాఠశాల విద్యాశాఖ డైరక్టర్‌ ఎ. శ్రీదేవసేన డీఈవోలకు ఆర్డర్లు ఇచ్చారు. ఈ జాబి తా ప్రకారం మండల స్థాయిలో ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు 144మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 138 మంది, సిస్టం అనలిస్టులు 12 మంది, ఇంక్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ పర్సన్లు 383 మందిని కాంట్రాక్టు ఉద్యోగులుగా భర్తీ చేస్తారు.

కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థ ఉండబోదని సీఎం ప్రకటించిన మరుసటి రోజే ఈమేరకు ఆదేశాలు వెలువడటం గమనార్హం. ప్రభుత్వ పాలసీయే లేనప్పుడు వీరికి జీతాలు ఎలా ఇస్తారు? ఈ నియామకాలు జరిగితే సీఎం ప్రకటనకు చట్టబద్ధత ఉంటుందా? అధికారులు ఎందుకు ఇలా ఆదేశాలిచ్చారు ? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

Related posts

సకల జనుల సంక్షేమమే ధ్యేయం

Satyam NEWS

టిటిడి ఈవో ఏకే సింఘాల్ ఆకస్మిక బదిలీ

Satyam NEWS

నష్టపోయిన కేరళ రైతుల్ని ఆదుకోండి

Satyam NEWS

Leave a Comment