27.7 C
Hyderabad
April 30, 2024 10: 07 AM
Slider ప్రత్యేకం

గులాబీ ద‌ళానికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న బీజేపీ

#bandisainjai

నిరంకుశ‌,నియంత్ర‌త్వ‌, కేసీఆర్ కుటుంబ పాల‌న ను గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ చేప‌ట్టిన ప్ర‌జా సంగ్రామ యాత్ర తొలిరోజు విజ‌య‌వంతంగా జ‌ర‌గ‌డంతో  అప్పుడే గులాబీ ద‌ళంలో గుబులు పుట్టింది. ఈ మేర‌కు ప్రజా సంగ్రామ యాత్ర తొలిరోజు సభ సక్సెస్ తో పార్టీ కార్యకర్తల్లో, నేత‌ల్లో ల్లో కొత్త జోష్ నెలకొందని పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ముక్త కంఠంతో అభిప్రాయపడింది.

సభ విజయవంతానికి క్రుషి చేసిన పాదయాత్ర కమిటీ నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపింది. పాదయాత్ర సభ సక్సెస్ తో తెలంగాణ సమాజంలో ఐక్యత వస్తోందని, ప్రత్యేకించి పాతబస్తీలోని హిందూ సమాజం ఏకమవుతోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

పాతబస్తీలో గత 20 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ స్థాయిలో సభ నిర్వహించిన దాఖలాల్లేవని, అది బండి సంజయ్ కుమార్ సారధ్యంలోని బీజేపీ  కే సాధ్యమైందని కొనియాడింది. సభ సక్సెస్ తో పాతబస్తీలో ప్రతి హిందువు కాషాయ జెండా పట్టుకుని ధైర్యంగా బయటకు వచ్చి సభలో, పాదయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందని పలువురు పేర్కొన్నారు. బండి సంజయ్ ప్రసంగం టైగర్ ఆలె నరేంద్ర  ప్రసంగాన్ని, ధైర్యాన్ని గుర్తు చేసిందని స్మరించుకున్నారు. 

ఈ సందర్భంగా  పార్టీ అధ్య‌క్షుడు,కరీంన‌గ‌ర్ ఎంపీ  బండి సంజయ్ పదాధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘మీ అందరి కష్టంవల్లే పాదయాత్ర తొలిరోజు సక్సెస్ అయ్యింది. కార్యకర్తల్లో కొత్త జోష్ నెలకొంది. పాతబస్తీలోని హిందువుల్లో సంతోషం నెలకొంది. వారిలో ఐక్యత వస్తోంది. కాషాయ జెండా పట్టుకుని ధైర్యంగా ముందుకు వస్తున్నారు. కేసీఆర్ సభలను తలదన్నేలా సభను సక్సెస్ చేశారు. అందరి క్రుషి, సహాయ సహకారాలవల్లే ఇది సాధ్యమైంది’’అని అన్నారు. సభ సక్సెస్ కోసం అహర్నిశలు కష్టపడిన పాదయాత్ర కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. పాదయాత్రలో ఇకపై ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘పాదయాత్ర సభ సక్సెస్ తో టీఆర్ఎస్ నేతల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. పాదయాత్ర మొదటి దశ సంపూర్ణంగా విజయవంతం అవుతుందనే నమ్మకం ఏర్పడింది’’అని పేర్కొన్నారు.

మ‌హ‌రాజ్  గంజ్ ఎమ్మెల్యే  రాజాసింగ్ మాట్లాడుతూ ‘‘పాతబస్తీలో ఏ రాజకీయ పార్టీ కూడా గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో సభ నిర్వహించలేదు. బీజేపీ కార్యకర్తల్లో జోష్ నెలకొంది. బీజేపీ పాతబస్తీలో మరింత పటిష్టం అవుతుందనే నమ్మకం ఏర్పడింది. సభ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు’’అని తెలిపారు.

శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ ‘‘  పాదయాత్ర సభను చూస్తే నాటి కురుక్షేత్ర సంగ్రామంలో కృ ష్ణుడి శంఖాన్ని పూరించి యుద్దాన్ని ఆరంభించిన ఘట్టాన్ని తలపించింది. పాతబస్తీ పూర్తిగా కాషాయమయమైంది. పోలీసులు, అధికార పార్టీ నేతలు ఇబ్బంది పెట్టాలని చూసినా వాటన్నింటినీ అధిగమించి సభను సక్సెస్ చేశారు. ఈ విషయంలో పాదయాత్ర నిర్వాహకుల క్రుషి అభినందనీయం’’అని పేర్కొన్నారు.

తొలి రోజు పాద్ర‌లో ఇంద్ర‌సేనారెడ్డి, బాబూమోహ‌న్,మాజీ మంత్రి విజ‌య‌రామారావు,మాజీ ఎంపీ గ‌రికపాటి రామ్మోహ‌న్ రావు,ప్రేమేంద‌ర్ రెడ్డి తో పాటు , ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ , ఎస్సీ, బీసీ, మహిళా మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా, ఆలె భాస్కర్, గీతామూర్తి,  బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ప్రకాశ్ రెడ్డి, ఉమారాణి, అధికార ప్రతినిధులు రాకేశ్ రెడ్డి, క్రిష్ణ సాగర్  తదితరులు పాల్గొన్నారు.

Related posts

అనుమతి ఇవ్వకపోయినా వినాయకచవితి జరుపుకుంటాం

Satyam NEWS

జయశంకర్ భూపాలపల్లి : కొండ గొర్రెను వేటాడి చంపిన కుక్కలు

Satyam NEWS

రోడ్ ప్ర‌మాదాలకు కార‌ణాలు అన్వేషించే ప‌ని కూడా చేస్తున్న ఖాకీలు…!

Satyam NEWS

Leave a Comment