38.2 C
Hyderabad
May 1, 2024 19: 10 PM
Slider హైదరాబాద్

బీజేవైఎం ఆధ్వ‌ర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ ద‌హ‌నం

bjym1

బీజేవైఎం అరెస్టుల‌ను నిర‌సిస్తూ స‌రూర్‌న‌గ‌ర్ బీజైవైఎం ఆధ్వ‌ర్యంలో కొత్త‌పేట‌లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ‌ను బుధ‌వారం 11గంట‌ల‌కు ద‌హ‌నం చేసి నిర‌స‌న‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా బీజేవైఎం నాయ‌కులూ విశ్వ‌నాథ్‌, రామారావు, బీజేపీ స‌రూర్‌న‌గ‌ర్ డివిజ‌న్ అధ్య‌క్షుడు సిద్ధూ ముదిరాజ్‌, సీనియ‌ర్ నాయ‌కులు మ‌ధుసూధ‌న్‌, బాణాల ప్ర‌వీణ్‌లు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, కోట్లాడి తెచ్చుకున్నతెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందింద‌ని ధ‌ర్నానిర్వ‌హిస్తే అరెస్టులు చేస్తారా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో నిరుద్యోగుల‌కు నిరుద్యోగ భృతి అంద‌జేస్తామ‌ని క‌ళ్ల‌బొల్లి మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చార‌ని ఆరోపించారు. అప్పుడేమో (తెలంగాణ ఉద్య‌మంలో) ఓయూ, కాక‌తీయ త‌దిత‌ర ఉస్మానియా యూనివ‌ర్సిటీల విద్యార్థుల ప్రాణాల‌ను ఫణంగా పెట్టి నేడు అదే విద్యార్థుల‌కు ఉద్యోగాలివ్వ‌మంటే తెలంగాణ త‌న‌వ‌ల్ల వ‌చ్చిన‌ట్లుగా కేసీఆర్ అహాంకార పూరిత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తూ నిరుద్యోగుల‌ను గాలికొదిలేశార‌న్నారు. ఇందిరాపార్కువ‌ద్ద ధ‌ర్నా చౌక్‌ను కూడా ఎత్తేయ‌డం కేసీఆర్‌కు ప‌ట్టుకున్న భ‌యం వ‌ల్లేన‌ని, త‌న‌కు ఎవ‌రూ వ్య‌తిరేకంగా ఉండ‌వ‌ద్ద‌నే ఆలోచ‌న ఆయ‌న‌లో ఉంద‌ని, త‌న‌ను ఎవ్వ‌రూ ప్ర‌శ్నించ‌వ‌ద్ద‌నే దుర్భుద్దీ క‌ల‌గ‌డంతోనే ధ‌ర్నాచౌక్‌ను కూడా ఎత్తేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. రాష్ర్టంలో కేసీఆర్ అవినీతి పాల‌న‌కు త్వ‌ర‌లోనే చ‌ర‌మ‌గీతం పాడే రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికైనా కేసీఆర్ స‌ర్కార్ మేలుకొని త‌క్ష‌ణ‌మే రెండుల‌క్ష‌ల‌ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని, నిరుద్యోగ భృతి క‌ల్పించాల‌ని బీజేవైఎం నాయ‌కులు టీఎస్‌పీఎస్సీ ముందు ధ‌ర్నా చేప‌డితే పెట్టిన త‌ప్పుడు కేసుల‌ను వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో స‌రూర్‌న‌గ‌ర్ బీజేపీ నాయ‌కులు గోవర్ధన్, కాటం రాజు, బెంగరబోయిన సురేష్ ,శివ, రంజిత్ కుమార్, శ్రీకాంత్, పాలకూర శశిధర్ గౌడ్, వెంకట్ స్వామి, సురేష్, సురేందర్, సంతోష్, కిషోర్, చింటూ, పలువురు బిజెపి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Related posts

తిరుపతి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సంకీర్తన…!

Satyam NEWS

ఓటు అడిగే ముందు ఏం చేశామో చెప్పాలి

Sub Editor

కేసీఆర్ భజనపరులు ఉద్యమ సమయంలో ఎక్కడున్నారు?

Satyam NEWS

Leave a Comment