31.2 C
Hyderabad
May 3, 2024 00: 45 AM
Slider మహబూబ్ నగర్

కేసీఆర్ భజనపరులు ఉద్యమ సమయంలో ఎక్కడున్నారు?

#nagarkurnool

టీఆర్ ఎస్ లోని కేసీఆర్ భజనపరులంతా ఉద్యమ సమయంలో ఎక్కడున్నారని నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.

కల్వకుర్తిలో మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్ బహిరంగ సభలో  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

టిఆర్ఎస్ పార్టీ యే  అభివృద్ధి చేసిందంటూ ఉదర కొడుతూ మంత్రి ప్రసంగించారని అయితే వాస్తవంగా రాష్ట్ర పరిస్థితి అలా లేదని ఆయన అన్నారు. పన్నెండు వందల మంది ఉద్యమకారులు బలిదానం, వాళ్ల త్యాగ ఫలితమే నేడు టీఆర్ఎస్ పార్టీ పెద్దలు అనుభవిస్తున్నారని ఆయన అన్నారు.

ఎవరి దయాదాక్షిణ్యాల పైన పింఛను ఇవ్వడం లేదని ఉద్యమ పుణ్యమే నేడు అన్ని కులాల లో 60 సంవత్సరాలు పైబడిన వృద్ధుల అందరికీ పింఛన్ సాధించమని ఆయన తెలిపారు. ఉచిత కరెంటు 24 గంటలు ఇస్తున్నాం అంటూ మీరు మీ భజన పరులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

ఉత్పత్తి అవుతున్న విద్యుత్ అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చివరి క్షణంలో  రాష్ట్రంలో సోలార్ ప్లాంట్ లకు అనుమతులు ఇచ్చిన సంగతి మీకు తెలియదా అన్నారు. తెలంగాణలో ఉన్న బడుగు బలహీన సామాజిక వర్గాలకు ఎలాంటి న్యాయం జరగడం లేదని, రైతు బంధు ఇస్తున్నాం అంటూ పేద ప్రజలకు ఇస్తున్నది గోరంత సామాజిక వర్గానికి ఇస్తున్నది కొండంత అని ఆయన అన్నారు.

అధికారం కోసం వేల కోట్లు ప్రజాధనాన్ని కొంతమంది బడా భూస్వాములకు ఇస్తున్నది మీరు  కాదా అని ఆయన ప్రశ్నాంచారు. దళితులకు చేసిందిఏమీ లేదు. దళితుల దగ్గర ఉన్న భూములను డంపింగ్ యార్డ్ పేరుతో పల్లె పకృతి వనం పేరుతో  లాగేసుకున్నారన్నారు.

కులం పేరుతో ఉన్న రెండు ఎకరాలు  తప్ప మీరిచ్చిన ది ఏం లేదని ఇచ్చిన మాటను 20 శాతం కూడా నిలబెట్టుకోలేని మీ ప్రభుత్వం హుజురాబాద్ లో ఉప ఎన్నికలు ఉన్నందున గత ఏడు సంవత్సరాలు గుర్తుకురాని డోక్రా భవనాలు ఇప్పుడు నాలుగు కోట్ల తో మంజూరు లెటర్ తీసుకొని ప్రజల చెవిలో పూలు పెడుతున్నారన్నారని ఆయన అన్నారు.

Related posts

అంగన్‌వాడీ నిర్వహణపై ఉన్నతాధికారుల సంతృప్తి

Satyam NEWS

“గాలోడు” ఘన విజయంతో గాలిలో విహరిస్తున్న రవిరెడ్డి

Satyam NEWS

మంత్రి కేటీఆర్ పర్యటన కోసం ఖమ్మం పోలీసుల భారీ భద్రత

Satyam NEWS

Leave a Comment