40.2 C
Hyderabad
April 29, 2024 16: 23 PM
Slider నల్గొండ

రైతుల ఉద్యమానికి మద్దతుగా ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో నిరసన

#INTUC

కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ, గత ఆరు మాసాలుగా దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరుగుతున్న రైతుల ఉద్యమం నేటికీ ఆరు నెలలు గడిచిన సందర్భంగా దేశంలోని INTUC,తో సహా 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, అఖిలపక్ష రైతు కిసాన్ మోర్చా ఇచ్చిన ‘భారత్ బ్లాక్ డే’ ను బలపరుస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇందిరా సెంటర్ నందు ట్రాక్టర్లతో,నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.INTUC నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర INTUC ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ పాల్గొని ప్రసంగిస్తూ దేశంలో  భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక చట్టాలను ఏకపక్షంగా సవరించారని, రైతులకు కనీస మద్దతు ధర లేని రైతు చట్టాలను తీసుకొచ్చారని, దేశంలో  లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం, కార్పొరేట్ సంస్థలకు బానిసలు చేసే విధంగా రైతు చట్టాలను తీసుకు వచ్చి, దేశ ప్రజల జీవితాలను పాతాళానికి నెట్టివేశారని అన్నారు.సత్వరమే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి,కార్మిక హానికర కోడ్ లను నిలిపివేయాలని నాగన్న గౌడ్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాముల శివారెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశముఖ్,INTUC పట్టణ అధ్యక్షుడు పాశం రామరాజు,మండల అధ్యక్షుడు మేళ్లచెరువు ముక్కంటి, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇంటి అచ్చమ్మ, సైదా, పి. రామ్మూర్తి, ఎ.సుదర్శన్, చప్పిడి సావిత్రి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్, జక్కుల మల్లయ్య,ముశం సత్యనారాయణ, పల్లపు వెంకటేశ్వర్లు, చౌడం శివపార్వతి, వీరబాబు, యరగాని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్‌ – పుదుచ్చేరి ల మధ్య ప్రారంభమైన తొలి డైరెక్ట్ విమానం

Satyam NEWS

‘ప్రేమిస్తే’ మూవీకి 17 ఏళ్లు

Satyam NEWS

పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాలి

Satyam NEWS

Leave a Comment