29.7 C
Hyderabad
May 3, 2024 04: 26 AM
Slider జాతీయం

రేప్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న వృద్ధుడి హతం

murder

కుమార్తె స్నేహితురాలు అంటే కూతురితోనే సమానం కదా. కాదని నిరూపించాడు ఈ కృరుడు. కూతురితో కలిసి ఉంటికి వస్తున్న అమ్మాయి (24)ని బలవంతం చేశాడో దుర్మార్గుడు. ఈ విషయం బయటకు రాకుండా ఆ అమ్మాయి కుటుంబానికి ఆర్థికంగా సాయం చేస్తూ వచ్చాడు.

ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో గతంలో రేప్ చేసిన ఫొటోల్ని ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరించాడు. దీంతో ఆ యువతి తెగించి, అతడిని బయటకు పిలిచి గొంతు కోసి చంపేసింది. ఈ ఘటన చెన్నైలో జరిగింది. చెన్నైలోని తిరివొట్టియూర్ ప్రాంతానికి చెందిన శేఖర్ (54) అనే వృద్ధుడి ఇంటికి తన కుమార్తె స్నేహితురాలు (24) తరచూ వస్తుండేది. ఆ యువతిని శేఖర్ నాలుగేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు.

అయితే అతడు తన కుటుంబానికి ఆర్థికంగా సాయం చేస్తూ ఉండడంతో ఆ వృద్ధుడి చేష్టల్ని మౌనంగా భరించింది. ఈ ఏడాది ఆమెకు పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ విషయం శేఖర్‌కు చెప్పడంతో గతంలో వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోల్ని సోషల్ మీడియాలో పెడతానని ఆ అమ్మాయిని, వాళ్ల కుటుంబాన్ని బెదిరించాడు. దీంతో ఏం చేయాలో అర్థంకాక,  అతడిని చంపేయాలని నిర్ణయించుకుంది ఆ యువతి.

సోమవారం వాషర్‌మెన్‌పేట్‌లోని  ఓ ప్లే గ్రౌండ్‌కు పిలిచింది. నెమ్మదిగా అతడి కళ్లలో గమ్ పోసి కత్తితో గొంతు కోసి చంపేసింది. గ్రౌండ్‌లో డెడ్ బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శేఖర్ స్నేహితులు, బంధువుల్ని విచారించారు. ఈ సమయంలో అతడి స్నేహితుడొకరు ఆ అమ్మాయితో శేఖర్ కు ఉన్న సంబంధం గురించి చెప్పాడు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న ప్రశ్నించగా తానే నేరం చేసినట్లు పోలీసుల దగ్గర ఆమె ఒప్పుకుంది.

Related posts

కామారెడ్డి జిల్లా కేంద్రానికి రానున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు

Satyam NEWS

ఆది శంకరుడే అందరి గురువు: డా.అంతర్ముఖానంద

Satyam NEWS

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని

Satyam NEWS

Leave a Comment