ఎల్లో మీడియా దేవాదాయ భూములపై అసత్యపు కధనాలను ప్రచురిస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. భీమిలిలో దేవాలయ భూములపై తప్పుడు కధనాలు రాశారని, టిడిపి పాలనలో జరిగిన అవినీతి ఎల్లో మీడియాకు కనిపించడం లేదా అని మంత్రి ప్రశ్నించారు. వాటిపై ఎల్లో మీడియా ఎందుకు ప్రచురించలేదు అని మంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వంపై బురద చల్లే విధంగా మీడియా వారు వ్యవహరిస్తున్నారని, వార్త రాసే ముందు వాస్తవాలు పరిశీలించాలని ఆయన హితవు పలికారు. ఎల్లో మీడియాకు ప్రభుత్వ పధకాలు కనిపించడం లేదని ఆయన అన్నారు. దేవాదాయ భూములను ఎవరికి ధారాదత్తం చేయడం లేదని మంత్రి చెప్పారు. దేవాదాయ శాఖలో గజం స్దలం అమ్మాలంటే హైకోర్టుపర్మిషన్ కావాలి ఈ చిన్న విషయం కూడా చంద్రబాబు అండ్ పార్టీకి తెలియదా అని మంత్రి ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మఠం భూములను ఇష్టారాజ్యంగా లీజులకు ఇచ్చేశారని తాము గత ప్రభుత్వం చేసినట్లుగా దేవాదాయభూములను ధారాదత్తం చేయలేదని మంత్రి వివరించారు. హధీరాంజీ మఠం భూముల దుర్వినియోగంపై చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు.