25.7 C
Hyderabad
May 9, 2024 07: 58 AM
Slider నిజామాబాద్

డబ్బులిస్తే ఒకే.. లేకుంటే సీజ్ చేపిస్తాం

#bogusjournalists

‘దొంగతనంగా బియ్యం తరలిస్తున్నారు. 15 వేలు ఇస్తే వదిలేస్తాం.. లేకపోతే బండి సీజ్ చేపిస్తాం.. మెయిన్ ఛానళ్లు మావే’ అంటూ ఓ వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించిన ముగ్గురు నకిలీ రిపోర్టర్లకు దేహశుద్ది చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వ్యాపారి, డిసిఎం సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి డిసిఎం వ్యానులో గాంధారి నుంచి కామరెడ్డికి ముక్కబియ్యం తీసుకుని వస్తున్నారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న ముగ్గురు నకిలీ రిపోర్టర్లు గాంధారి నుంచి డిసిఎం వ్యానును ఫాలో అవుతున్నారు. కామారెడ్డి గాంధీ గంజ్ లో వాహనం నిలపగానే సదరు వాహన డ్రైవర్ తన వాహనాన్ని ఫాలో చేస్తున్న విషయాన్ని యజమానికి తెలిపాడు. యజమాని వద్దకు వెళ్లిన సదరు రిపోర్టర్లు ‘తాము రిపోర్టల్లం. ఈ బియ్యం దొంగతనంగా తెస్తున్నారు. 15 వేలు ఇవ్వండి వదిలేస్తాం’ అని బేరసారాలకు దిగారు.

ఇవ్వకపోయే సరికి మెయిన్ చానళ్ళు మావే. ఇప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం అంటూ సివిల్ సప్లై అధికారులకు ఫిర్యాదు చేయకుండా 100 నంబరుకు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బేరసారాలు కొనసాగించారు. 10 వేలు ఇవ్వండి అంటూ కనీసం 5 వేలు ఇచ్చినా వెళ్లిపోతామంటూ బేరసారాలు చేశారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన వ్యాపారి, డిసిఎం సిబ్బంది ఐడి కార్డులు చూపించాలని కోరగా నిరాకరించారు.

ప్రధాన ఛానళ్ల రిపోర్టర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోగా నకిలీ రిపోర్టర్లుగా నిర్దారించుకుని ముగ్గురిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా నకిలీ రిపోర్టర్లపై ఫిర్యాదు చేశారు. గతంలో వీరిపై కేసులు కూడా ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై పిడి యాక్టు నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా సమాచారం.

Related posts

ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి జూపల్లి

Satyam NEWS

మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు

Sub Editor 2

ఘనంగా జగనన్న క్రీడా సంబరాల ప్రైజ్ మనీ పంపిణీ

Satyam NEWS

Leave a Comment