29.7 C
Hyderabad
April 29, 2024 09: 23 AM
Slider సినిమా

బోల్తా’ …శంకర్: భోళా శంకర్ పై నిష్పక్షపాత సమీక్ష

#Bhola Shankar

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే అందరికీ క్రేజే. ఇక ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా ఫస్ట్ రోజు చూడనిదే నిద్రపోరు. ఫస్ట్ డే సినిమా కోసం పోటీ పడి మరీ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. దశాబ్దకాలంగా మెగాస్టార్ సినిమా ఫస్ట్ డే నాడు పండుగ చేసుకుంటూ ఉంటారు. ఇక చిరంజీవి నటించిన లేటేస్టు మూవీ ‘భోళా శంకర్’ నేడు విడుదలై థియేటర్లో సందడి చేస్తోంది.

చిరంజీవి, కీర్తి సురేష్ లు అన్నా చెల్లెళ్లు. వీరిద్దరు కోల్ కతాలో నివసిస్తూ ఉంటారు. ఇక అమ్మాయిలను కిడ్నాప్ చేసే గ్యాంగ్ అందరినీ ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ క్రమంలో తమన్నా బ్రదర్ సుశాంత్ తో కీర్తి సురేష్ లవ్లో పడుతుంది. ఇలా ఓవైపు ఫ్యామిలీ ఎంటర్టైనర్ మరోవైపు గ్యాంగ్ ఆట కట్టించే పనిలో చిరు ఎలా సక్సెస్ అయ్యాడనేదే కథాంశం. భోళా శంకర్ కథ తమిళ ప్రేక్షకులకు తెలిసినా తెలుగువాళ్లకు పూర్తిగా తెలియదు. కానీ ఇక్కడి వారికి అనుగుణంగా దీనిని చిత్రీకరించారు. అయితే ఎప్పటిలాగే చిరు లైఫ్ లో రెండు కోణాలు అన్నట్లు గా చూపించారు.

ఒకటి ఫ్లాష్ బ్యాక్. మరొకటి రియాలిటీ. చెల్లెలు సెంటిమెంట్ లో చిరు ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారు. అయితే బ్యాగ్రౌండ్ తో వచ్చే మ్యూజిక్ తో ‘బోళా శంకర్’లో సెంటిమెంట్ ఆకట్టుకుంటుంది. చిరంజీవి మాస్ యాటిట్యూడ్ తో ప్రయత్నించారు కానీ.. మెహర్ రమేష్ ఫస్ట్ హాఫ్ లో ఎగ్జైటింగ్ గా అనిపించే సన్నివేశాలు క్రియేట్ చేయలేదు. ఒకటి రెండు సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. ఇక పాటలు, బిజియం కూడా ఒకే అనిపించేలా ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు అయితే ఓవర్ ది టాప్ గా అనిపిస్తాయి. మిల్కీ బ్యూటీ సాంగ్ చిత్రీకరణ బావుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్, విలన్ ఫేస్ ఆఫ్ సన్నివేశాలు ఫ్యాన్స్ ని మెప్పించే విధంగా మెహర్ రమేష్ తీర్చి దిద్దారు.

భోళా శంకర్ ఓ వైపు సెంటిమెంట్ గా కనిపిస్తూనే మరోవైపు రౌడియిజంపై ఫైట్ చేస్తాడు. ఒక దశలో ఫ్లాఫ్ బ్యాక్ లో చిరంజీవి భోళా భాయ్రౌడీలాగే కొనసాగుతాడు. ఆయితే ఆ తరువాత కీర్తి సురేష్ సుశాంత్ తో ప్రేమలో పడిన తరువాత అసలు స్టోరీ మొదలవుతుంది. ఫస్టాప్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో సాగి.. సెకండాఫ్ సీరియస్ గా కొనసాగుతుంది. మొత్తంగా సినిమా ఫస్టాఫ్ కంటే సెకండాప్ ఫరవాలేదనిపిస్తుంది. మెగాస్టార్ యాక్టింగ్ కు తిరుగులేదు. రెండు పాత్రలో చిరు తన పనితనాన్ని చూపించారు. అయితే కొన్ని ఫైట్స్ సీన్స్ చాలా వరకు ఆకట్టుకున్నా.. గ్రాఫిక్స్ పనితనం తెలిసిపోతుంది.

ఇక కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో ఆకట్టుకుంది. సుశాంత్ సైడ్ పాత్రలో కనిపించి పర్వాలేదనిపించాడు. ఇందులో కీర్తి సురేష్ చెల్లెలుగా శ్రీముఖి అలరించింది. తమన్నాకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా..సాంగ్స్ తో అలరించింది.
ఇక సెకండ్ హాఫ్ బిగినింగ్ లో వచ్చే సన్నివేశాలు మాత్రం ఫర్వాలేదు. బోళా రేజ్ బీజీయం, భోళా మానియా సాంగ్ సూపర్బ్ గా వర్కౌట్ అయ్యాయి. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో చిరు తన నటన, స్టయిల్ తో ఆకట్టుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేస్తూ చేసిన కొన్ని సీన్లు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు.. కానీ చిరు తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా బోరింగ్ సన్నివేశాలని కూడా సేవ్ చేసే ప్రయత్నం చేశారు.

డైరెక్టర్ మెహర్ రమేష్ చిరంజీవి సినిమా విషయంలో కాస్త జాగ్రత్త పడ్డాడు. కాకపోతే కొన్ని రొటీన్ సీన్స్ పెట్టారు. సిస్టర్ సెంటిమెట్ సినిమాల్లో ఇవి కచ్చితంగా ఉంటాయన్నట్లు పాతవే పెట్టి బోరు కొట్టించారు. మొత్తంగా దూరదర్శన్ కాలం నాటి సెంటిమెంట్లు…టీవీ సాగతీత సీరియల్స్ కొన్ని లాగింగ్ సన్నివేశాలు మనకు సెకండాఫ్లో కనిపిస్తాయి. సినిమా నిర్మాణ విలువలు మాత్రం ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ హైలెట్ అని చెప్పొచ్చు. అయితే పాటలు ఒకటి రెండు మినహా మిగతావి పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. మొత్తంగా సినిమాలో నటులు తమ పాత్రలకు న్యాయం చేసినా.. కొత్త సీసాలో పాత సార అన్నట్లుగా ఉంది.

Related posts

పంజాబ్‎లో బొగ్గు కొరత.. తగ్గిపోయిన విద్యుత్ ఉత్పత్తి..

Sub Editor

పొంగులేటి, జూపల్లి లతో రేవంత్‌తో కీలక భేటీ?

Bhavani

అభిమానులకు నందమూరి బాలకృష్ణ గ్రీటింగ్స్

Satyam NEWS

Leave a Comment