38.2 C
Hyderabad
April 29, 2024 20: 52 PM
Slider శ్రీకాకుళం

ఆ పుస్తకాన్నిపిల్లలే కాదూ పెద్దలూ చదవాల్సిందే!

Gayathri Devi-3

నేటి స్మార్ట్ యుగంలో ప్రతీ ఒక్కరి చేతిలో పెన్ను, పుస్తకం కన్నా.. స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆధునిక, సాంకేతిక రంగంలో… పుస్తకాలు పట్టుకుని చదువుకోవడం కల్లే అని చెప్పాలి. ఈ వేగవంతమైన డిజిటల్ కాలంలో అన్నీఆన్ లైన్ లోనే సాగిపోవడం పరిపాటి అయిపోయింది.

పాత‌జ్ఞాప‌కాలు అవ‌లోక‌నం

అయితే నాటి తరాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుత ఆ స్మార్ట్ కాలంలో పాత జ్ఞాపకాలను అవలోకనం చేసే విధంగా ఓ పెద్దావిడ అదీ ఏపీ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో సమగ్ర స్ర్తీ శిశు సంక్షేమ శాఖలో పని చేసిన గాయత్రీ దేవి స్వయంగా రాసిన బాలలకు చెందిన కథలు పిల్లల కన్నవాళ్లకూడా ఇట్టే ఆకట్టుకోవడం ఖాయమని…ప్రముఖ రచయితలు పేర్కొంటున్నారు. ప్రత్యేకించి ‘బాలదీప్తిస‌ పేరుతో రాసిన బాలల గేయ కవితలు రాసిన రచయత్రి ఎం.వి.గాయత్రి వంద కవితలను అందరూ గేయ రూపంలో పాడే విధంగా స్వయంగా రాసి ఓ పుస్తక రూపంలో ముద్రించిన ఆమె కృషి అభినందనీయం. ఈ గేయాలు ప్రతీ అమ్మ, నాన్నలు తమ, తమ పిల్లలకు చదివి తెలియ చెప్పేలా రచయత్రి గాయత్రీదేవి ఈ ‘బాలదీప్తి’ పుస్తకంలో దాదాపు వందకు పైగా గేయ కవితలను హర్షణీయం.

ఎంవీఎస్‌డీకి అంకితం

చిన్నతనంలోనే ప్రతీ ఒక్కరూ తమ, తమ చిరుప్రాయాన్నిగుర్తు తెచ్చుకునేలా రచయత్రీ గాయత్రీ దేవి ‘బాలదీప్తి’ పుస్తకంలో ముద్రించడం ఎంతో గొప్ప విషయం. సుమారు వంద గేయకవితలను ముద్రించిన ‘బాలదీప్తి’ పుస్తకాన్నిఎం.వీ.ఎస్.డీ. ప్రసాదరావుకు అంకితం చేసారు రచయత్రీ గాయత్రీదేవి. ఏదైనా ఆధునిక పోకడలతో, స్మార్ట్ యుగం కాలంతో మగ్గుతున్ననేటి తరానికి రచయత్రి గాయత్రీ దేవి రచించిన ‘బాలదీప్తి’ పుస్తకం తమతమ జ్ఞాపకాలను గుర్తు చేస్తాయనటంలో సందేహం లేదంటోంది.

Related posts

సోమశిల గట్టు నుండి రియల్ వెంచర్లకు వందల టిప్పర్ల మట్టి తరలింపు?

Satyam NEWS

(Sale) – Cipla Medicine For High Blood Pressure Traditional Chinese Medicine Herbs For High Blood Pressure Pink Oval Blood Pressure Pills 50 Mg

Bhavani

కరోనా వ్యాప్తి అరికట్టడంలో ఇమ్రాన్ ఖాన్ విఫలం

Satyam NEWS

Leave a Comment