విజయనగరం జిల్లా ఏసీబీ డీఎస్పీ గా పని రిటైర్ అయిన అనంతరం బ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గా పని చేసి….ప్రస్తుతం ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు గా ఉన్న కేపీ ఈశ్వర్ గత రాత్రి మృతి చెందారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలో మండపం వీధిలో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు సానుభూతి ని తెలియజేసారు.
సమాజ హితానికి కె.పి ఈశ్వర్ చేసిన సేవలు ఎనలేని వని విజయనగరం ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ ప్రభుత్వ పింఛన్దారులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కెపి ఈశ్వర్ ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఉత్తమ అధికారి గా సేవలు అందించి ఎంతోమందికి మార్గదర్శిగా నిలిచారు అని అన్నారు. నీతికి, నిజాయితీకి నిలువెత్తు రూపం కే పి ఈశ్వర్ అని అన్నారు. బ్రాహ్మణ జాతి సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తి అని, అన్నారు. కేపీ ఈశ్వర్ మృతి దీని వల్ల విజయనగరం ఓ పెద్దదిక్కును కోల్పోయింది అన్నారు.