Slider ఖమ్మం

పౌష్టికాహారం అందించేందుకే అల్పాహార పథకం

#breakfast

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నేటి నుండి ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని అమలుచేస్తున్నట్లు, దీనికి అన్ని ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ జలగం నగర్ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథక ఏర్పాట్లను తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య, చేపడుతున్న అల్పాహారం, తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన అభ్యాసంతో పాటు, పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం ద్వారా పౌష్టిక అల్పాహారం అందించనున్నట్లు ఆయన అన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా విద్యపై విద్యార్థుల దృష్టిని పెంచాలని లక్ష్యంగా ఈ పథకం అమలుచేయనున్నట్లు ఆయన తెలిపారు. అన్ని పాఠశాల పనిదినాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరికీ ఈ పథకం అందుబాటులో ఉంటుందని కలెక్టర్ అన్నారు.
కలెక్టర్ తనిఖీ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా విద్యా శాఖ అధికారి ఏ. సోమశేఖర శర్మ, ఖమ్మం రూరల్ తహసీల్దార్ రామకృష్ణ, ఎంపిడిఓ రవీందర్ రెడ్డి, ఎంపీఓ రాజారావు, పాఠశాలప్రధానోపాధ్యాయలు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

Related posts

అభివృద్ధి పథంలో దూసుకువెళుతున్న నారాయణ ఖేడ్

Satyam NEWS

ఉనికి కోసమే టీడీపీ బస్సు యాత్ర…!

Satyam NEWS

వైసీపీ నేత ఆధ్వర్యంలో పేకాట డెన్

Bhavani

Leave a Comment