40.2 C
Hyderabad
April 29, 2024 18: 17 PM
Slider చిత్తూరు

కపిలతీర్థం వద్ద పార్కింగ్ సమస్యను పరిష్కరించండి

#NaveenKumarReddy

తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయాన్ని చక్రతీర్థం లేదా ఆల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కపిలేశ్వర స్వామి ఆలయంలోని విగ్రహాన్ని సాక్షాత్తు “కపిలముని” స్వామి చేతుల మీదుగా ప్రతిస్తించబడినదని అందుకే ఇక్కడ శివుడిని కపిలేశ్వరుడుగా పిలవడం జరుగుతుందని చరిత్ర చెబుతుంది. టిటిడి ఆధ్వర్యంలో మహాశివరాత్రి,కార్తీక మాసం, బ్రహ్మోత్సవాలను ప్రతి సోమవారం అభిషేకాలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం వేలాది మంది భక్తులతో పాటు ముఖ్యంగా తిరుపతి స్థానికులు పరిసర ప్రాంత గ్రామ ప్రజలు ప్రతి సోమవారం కపిలేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ.

కపిల తీర్థం వద్ద వాహనాలకు సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో రోడ్డుపై టెంపో ట్రావెల్స్, కార్లు, ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు నగరపాలక సంస్థ గుత్తేదారుడు అని 50 రూ. 30 పార్కింగ్ వసూలు చేయడంతో రోడ్డుపై వాహనాలను ఇష్టానుసారంగా పార్కింగ్ చేసేస్తున్నారు. దీని కారణంగా ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతుంది భక్తులకు అసౌకర్యం పెరుగుతుంది. టిటిడి నగరపాలక సంస్థ సమన్వయంతో అటవీ శాఖ అధికారులతో చర్చించి కపిల తీర్థం ఆర్చ్ పక్కన ఉన్న ఫారెస్ట్ స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేస్తే వాహనాలలో వచ్చే భక్తులందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు.

శబరిమల అయ్యప్ప స్వాముల రద్దీ పెరగడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను రోడ్లపై పార్కింగ్ చేయడంతో తిరుమల నుంచి వచ్చే ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు నంది సర్కిల్ మలుపు వద్ద ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కొంచెం ఆదమరిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. కపిల తీర్థం వద్ద భక్తుల సౌకర్యార్థం వెంటనే ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని కేటాయించి ప్రమాదాలు జరగకుండా నివారించాలని టిటిడి, నగరపాలక సంస్థ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Related posts

హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర  మున్నూరు కాపుల  సంఘం

Satyam NEWS

తెలుగు సినీ పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయింది

Bhavani

ఆధునిక భావ విప్లవకారుడు యోగి వేమన

Bhavani

Leave a Comment