40.2 C
Hyderabad
May 2, 2024 16: 30 PM
Slider హైదరాబాద్

మూడోసారి అధికారంలోకి రావడానికి మళ్లీ బిఆర్ఎస్ మాయాజాలం

#ravikumaryadav

మూడోసారి అధికారంలోకి రావడానికి మళ్లీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎరగా చూపి అధికారంలోకి రావాలని బిఆర్ఎస్ చూస్తుందని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ విమర్శించారు. గడపగడపకు బిజెపి కార్యక్రమంలో మోడీ చేస్తున్న అభివృద్ధి చిట్టాను కరపత్రం ద్వారా బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మంగళవారం ఇంటింటికి తిరిగి అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల పేరిట పేద ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని, బి ఆర్ ఎస్ అంటే భూకబ్జాల పార్టీ అని దుమ్మెత్తి పోశారు.మళ్లీ డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఏర గా చూపి అధికారం చేజిక్కించుకోవాలని కెసిఆర్ చూస్తున్నారని, ప్రజల కష్టాలను పట్టించుకోవలసిన  ప్రజాప్రతినిధులే కంచె చేను మేసింది అన్నట్టుగా పరిపాలన కొనసాగిస్తున్నారని  26వ రోజు ప్రజా యాత్రలో గడపగడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా ఆయన విమర్శించారు.

వివేకానంద నగర్ డివిజన్ బాగ్ అమీర్లో స్థానిక నాయకులతో కార్యకర్తలతో ఇంటింటికి తిరిగి నరేంద్ర మోడీ  చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రం ద్వారా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం చేపట్టారు. ఈ తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలు అనేక అష్ట, కష్టాలు పడుతున్నారని స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలు పట్టించుకోకపోగా ఎలక్షన్లు సమీపిస్తున్న సమయంలో మరొకసారి రాష్ట్ర ప్రజలను డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని మభ్యపెట్టి గద్దెనెక్కాలని చూస్తున్నారని శేరిలింగంపల్లి నియోజకవర్గం లో 50,000 వేల అప్లికేషన్స్ రాగా మీరు ఇప్పటివరకు ఎన్ని ఇల్లు కట్టారని ఎంతమందికి ఇచ్చారో లెక్కలు చెప్పాలని ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించారు.

అత్యధిక జనాభా, అత్యధిక పేదవారు నివసించే నియోజకవర్గం మన శేర్లింగంపల్లి నియోజకవర్గం కాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాయ మాటలు చెప్పకుండా అర్హులైన వారందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లును కట్టించి మాట నిలబెట్టుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నర్సింగ్ రావు కంటెస్టెంట్ కార్పొరేటర్ విద్యా కల్పన, శ్రీహరి యాదవ్, పర్వతాలు యాదవ్, రేపాన్ రాజు, ఏకాంత గౌడ్, గోపాల్ రావు, అశోక్, జితేందర్, లలిత రెడ్డి, మమత, జయశ్రీ, పిట్టల శీను ,శాలిని, శృతి, కళ్యాణ్ కుమార్ ,సంధ్య, బంటి, ,కార్యకర్తలు, స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇళ్ళ మోసాలపై జనసైనికుల ఆరా

Bhavani

నిర్లక్ష్యం వద్దు

Sub Editor 2

మాజీ ఎమ్మెల్యే ఆమంచికి పాము కాటు

Bhavani

Leave a Comment