33.7 C
Hyderabad
April 30, 2024 00: 59 AM
Slider హైదరాబాద్

అబద్దపు వాగ్దానాలతో అధికారంలో వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం

#kukatpalli

అబద్దపు వాగ్దానాలు చెప్పి అధికారంలో వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం నేటికీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని తీసుకెళ్తామని పిసిసి సభ్యులు డాక్టర్ సత్యం శ్రీరంగం అన్నారు. ఏఐసీసీ ఆదేశానుసారం రాహుల్ గాంధీ పిలుపు మేరకు, రేవంత్ రెడ్డి సూచనలతో దేశ వ్యాప్తంగా ప్రారంభమైన హాథ్ సే హాథ్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని సోమవారం కూకట్ పల్లి నియోజక వర్గంలో పీసీసీ సభ్యులు డా. సత్యం శ్రీరంగం ప్రారంభించారు.

ఈ సందర్భంగా  ఫిరోజ్ గూడలో డా. బి ఆర్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నుంచి హత్ సే హత్ జోడో అభియాన్ యాత్ర ను కోనసాగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ   కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ విధానాలను హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. రాహుల్ గాంధీ సందేశాన్ని కూకట్ పల్లి నియోజక వర్గ ప్రజలకి ఇంటింటికీ వెళ్లి తెలియచేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పుష్పా రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గా రాణి, ఏ బ్లాక్ అధ్యక్షులు పి. నాగి రెడ్డి, నల్లోల రాజేందర్, మధు మోహన్, జావీద్ ఆలీ, విట్టల్ రెడ్డి, కొన్నింటి శామ్యూల్, బంధిగ బాల నర్సింహా, నరసింహ యాదవ్, జ్యోతి, మొయినుద్దీన్, చిటుకోరు క్రిష్ణా, క్రిష్ణా రాజ్ పుత్, మట్టే ప్రసన్న కుమార్, మధు గౌడ్, మహేందర్, ముఖేందర్, హేమంత్, జల్లా శివ, సూర్య, శేఖర్ గజానంద్, మాదరి శ్రీను, భరత్, పుట్టపాక మధు, చంటి సింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, కూకట్ పల్లి

Related posts

జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చెయ్యాలి

Satyam NEWS

కడప జిల్లాలో కొత్తగా మరో 39 కంటైన్మెంట్ జోన్లు

Satyam NEWS

దళితుల స్మశాన వాటికను రక్షించాలి

Bhavani

Leave a Comment