37.2 C
Hyderabad
April 26, 2024 19: 15 PM
Slider కడప

కడప జిల్లాలో కొత్తగా మరో 39 కంటైన్మెంట్ జోన్లు

#Kadapa Collector

కడప జిల్లాలో ఇటీవల కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదైన కారణంగా మరో  39  కొత్త కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టరు సి.హరికిరణ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన “ కొవిడ్ ఇన్స్టంట్ ఆర్డర్-50” ను అనుసరించి ఈ క్రింద తెల్పిన 39 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశామన్నారు.

రాజంపేట అర్బన్ లోని  శాంతి నగర్, సరస్వతిపురం, రామ్ నగర్, మైదుకూరు అర్బన్ లోని వనిపెంట రోడ్, బద్వేల్ అర్బన్ లోని భావ నారాయణ నగర్, జమ్మలమడుగు అర్బన్ లోని పెద్ద పసుపుల రోడ్డు, గడ్డ వీధి, రాయచోటి అర్బన్ లోని మహబూబ్ భాషా వీధి, ఎర్రగుంట్ల అర్బన్ లోని సొద్దల వీధి, ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తి, మేకల బాలయ్యపల్లి,   కలమల్ల, చిలమకూరు,

రాజంపేట మండలం లోని వైబిఎన్ పల్లి, గుండ్లూరు,  ప్రొద్దుటూరు రూరల్ లోని నంగనూరు పల్లి, భగత్ సింగ్ కాలని, ధార అపార్ట్మెంట్స్, మైదుకూరు మండలం లోని ఎన్.ఎర్రబల్లి, ఒంటిమిట్ట మండలంలోని రాచగుడి పల్లి, సింహాద్రిపురం లోని ఎస్సి కాలని, సింహాద్రిపురం మండలంలోని గురుకుంట రోడ్(గురజాల), ఎస్సి కాలని అగ్రహారం, పుల్లంపేట లోని డా.చలమయ్య హాస్పిటల్ వెనుక వీధి,

లింగాల మండలంలోని దిగువపల్లి, కామసముద్రం, వేంపల్లి లోని రాజతోట, స్తితప్రగ్నా నగర్, వేంపల్లి మండలంలోని ఐఐఐటి ఆర్కే వ్యాలీ, కాలేజ్ రోడ్, దువ్వూరు మండలంలోని పుల్లారెడ్డి పేట, క్రిస్టియన్ కాలని, లక్కిరెడ్డి పల్లి మండలంలోని సిద్దకవాండ్ల పల్లి,

ముద్దనూరు మండలంలోని కొర్రపాడు, మంగపట్నం, దేనేపల్లి, సికే దిన్నె మండలంలోని ఊటుకూరు సాయి నగర్, ఊటుకూరు హరిజనవాడ, అట్లూరు మండలంలోని వలసపాలెం అనే 39  కంటైన్మెంట్లు ఏర్పాటు చేశామన్నారు. కంటైన్మెంట్ జోన్లలోని ప్రజలు ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా సహకరించి, కరోనా వ్యాధి వ్యాప్తిని నియంత్రించడంలో భాగస్వాములు కావాలని  కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పని సరిగా భౌతిక దూరం, వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ మాస్కులు ధరించడం, శానిటైజర్లు, సబ్బులతో తరచూ చేతులు శుభ్రపరుచుకోవడంతో పాటు, వ్యక్తిగత శుభ్రతను తప్పనిసరిగా పాటించాల్సిందిగా కలెక్టరు ఆ ప్రకటనలో తెలిపారు.

Related posts

యువత మెరుగైన విద్య అభ్యసించేందుకు శిక్షణ

Satyam NEWS

సిపిఐ బలోపేతానికి మిలిటెంట్ పోరాటాలు

Sub Editor 2

జనసేన సభ్యత్వం ఉంటే రూ.5లక్షల భీమా ఉన్నట్లే

Satyam NEWS

Leave a Comment