36.2 C
Hyderabad
April 27, 2024 21: 43 PM
Slider నల్గొండ

వంటగ్యాస్ ధరల పెంపుకు వ్యతిరేక నిరసనల వెల్లువ

#saidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి శుక్రవారం హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రలలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిరంకుశ మొండి వైఖరి విధానాలను ఎండగట్టారు.

ఈ సందర్భంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరులను నిలదీశారు.400 రూపాయలు ఉన్నటువంటి వంటగ్యాస్ బండ ధర ఈరోజు 1200 రూపాయలకు తెచ్చిన ఘనత బిజెపి కేంద్ర ప్రభుత్వానిదని,కేంద్ర ప్రభుత్వానికి ప్రజల యొక్క కష్టసుఖాలు, బాగోగులు పట్టింపులు ఉండవని,వారికి కావాల్సిందల్లా ధరలు,పన్నులు పెంచుకుంటూ పోవడమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని, ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నా,కన్నీరు కారుస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని అన్నారు.

బిజెపి కేంద్ర ప్రభుత్వం కేవలం  అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీల యొక్క బాగు కోసమే తమ విధానాలను తీసుకొస్తున్నారని,అదాని తన యొక్క మోసపూరితమైన షేర్ల గోల్మాల్ వ్యవహారంలో చాలామంది తమ యొక్క పెట్టుబడులను పెట్టి మోసపోయారని ధ్వజమెత్తారు.మధ్యతరగతి పేద వర్గాలు ఆ షేర్లను కొనుగోలు చేసి దివాలా తీసారని, కేవలం ఏడు రోజులలోనే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల సంపాదన ఆవిరి చేశారని,అట్టి అదానిని కేంద్ర ప్రభుత్వం కాపాడటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుందని,అదాని,అంబానీ రకరకాల కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన లక్షల కోట్ల అప్పులను బ్యాంకులలో రైట్ ఆఫ్ చేస్తుందని అన్నారు.

ఇదంతా ప్రజల సొమ్మని,కార్పొరేట్ కంపెనీలకు ఆవిధంగా వారికి అనుకూలంగా విధానాలు చేస్తూ మరొకవైపు పేద నిరుపేద ప్రజలు జీవించడానికి ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈవిధంగా గ్యాస్ ధరలు పెంచి ప్రజల యొక్క నడ్డిని విరిచేసి ఏమాత్రం కోలుకోకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతూ పన్నుల మీద పన్నులను పెంచుతూ,ధరల మీద ధరలను పెంచుతూ నిత్యవసరకుల ధరలను కూడా ఆకాశాన్ని అంటేలా పెంచి వారి జీవన విధానాన్ని తీవ్రంగా దోచుకుంటూ ప్రజలను పేదవారిని మరీ పేద వారిగా,నిరుపేదలను బిచ్చగాళ్లుగా మారుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజలందరూ తెలుసుకొని వ్యతిరేకించి దుష్ట బిజెపి కేంద్ర ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని శానంపూడి సైదిరెడ్డి పిలుపునిచ్చారు.

పెంచిన ఈ వంటగ్యాస్ ధరలు చిరు వ్యాపారస్తుల పొట్టను కొడుతున్నాయని, వారు అంతంతమాత్రంగా రోజువారి కూలీని సంపాదించుకునే క్రమంలో ఆ కూలి కూడా గిట్టుబాటు కాక నష్టాల పాలవుతూ చిరు వ్యాపారస్తులు విలవిలాడే రోజులు వస్తున్నాయని అన్నారు. వంటగ్యాస్ ధరలు పెంచడం వల్ల చిరు వ్యాపారస్తులు కూడా తమ యొక్క ఉత్పత్తుల ధరలను పెంచటంతో ఆవిధంగా కూడా పేద ప్రజలకే భారంగా సంక్రమిస్తుందని,ఈ విధంగా ప్రత్యక్షంగానో,పరోక్షంగానో బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రజల ఉసురు పోసుకుంటుందని అన్నారు.

ఈరోజు దేశం మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వైపు చూస్తుందని, తెలంగాణలో అమలు చేస్తున్న ప్రజాభివృద్ధి,సంక్షేమ పథకాలు నేడు యావత్ భారతదేశానికి ఒక రోల్ మోడల్ గా తయారయ్యాయని,అందుకే దేశ మొత్తం కెసిఆర్ ని తమకు నాయకత్వం వహించి అభివృద్ధి బాటలో పయనింపజేసే దిశగా తీసుకొని పోవాలని యావత్ భారతదేశం కోరుతుందని అన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని, ప్రియతమ నాయకుడు కెసిఆర్ రైతు సంక్షేమ విధానాలతో పేద,నిరుపేద ప్రజల సంక్షేమ విధానాలతో భారతదేశ దిశ, దశలను నిర్ధారించబోతున్నారని అన్నారు. అద్భుతమైన పరిపాలనా దక్షతతో ప్రజల అభివృద్ధి సంక్షేమ విధానాలతో,రైతు ప్రభుత్వ విధానాలతో రానున్న ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ దేశంలో అద్భుతమైన విజయాలను చూస్తుందని,దుష్ట బిజెపి ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదని శానంపూడి అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు,కార్యకర్తలు బి.ఆర్.ఎస్ పార్టీ మహిళా ప్రజా ప్రతినిధులు,మహిళా కార్యకర్తలు,పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా మహిళలు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

పని చేస్తే పదవి ఇస్తా మీకు ఓకేనా?

Satyam NEWS

466 అంబులెన్సులు ప్రారంభం

Bhavani

తొలి కేసును చేధించిన సైబ‌ర్ క్రైమ్ పోలీసులు…!

Satyam NEWS

Leave a Comment