28.7 C
Hyderabad
April 26, 2024 09: 51 AM
Slider వరంగల్

ఆపదలో ఉన్న బాలలకు అమృత హస్తం చైల్డ్ లైన్ -1098

#mulugu

ములుగు జిల్లాలో ఆపదలో  ఉన్న బాల బాలికల కోసం అమృత హస్తం లాగా కృషి చేస్తుందని చైల్డ్ లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్‌ బరిగేల ప్రణయ్ అన్నారు.

కోవిడ్  తో బాధ పడుతూ సహాయం అవసరమైన బాలల కోసం చైల్డ్ లైన్ 1098- సహాయక  కిట్లను అందచేస్తున్నదని ఆయన తెలిపారు. జిల్లాలో ములుగు , ఎటూరునాగారం ,వాజేడు, వెంకటాపురం ,గోవిందరరావు పేట, తాడ్వాయి  లోని  గుర్తించిన బాలలకు ఈ సహాయక కిట్లను చైల్డ్ లైన్ సిబ్బంది, ICDS సిబ్బంది సంయుక్తంగా అందచేస్తారని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారిణి E.P. ప్రేమ లత  చైల్డ్ లైన్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఈ  కార్యక్రమం చేపట్టామన్నారు.

ఈ సందర్బంగా  బన్ను  చైల్డ్ లైన్,  జిల్లా కోర్దినేటర్, బరిగేల ప్రణయ్   మాట్లాడుతూ  ములుగు జిల్లాలోని  బాలల కొరకు ఆపదలో అమృత హస్తం అందిస్తూ భరోసా కల్పిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో  చైల్డ్ లైన్ సిబ్బంది K.రమ్య , P.ప్రభావతి , రాంబాబు ,సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన వాజపేయి

Satyam NEWS

శోభాయమానంగా ఆరంభమైన శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

Satyam NEWS

విశాఖపట్నంలో దారుణ హత్య

Bhavani

Leave a Comment